ప్రత్యక్ష దైవం – అమ్మ

Must read

ఎముకలు విరిగే బాధను,
రక్తము ముద్దల నరకాన్నీ
భరిస్తూ
జన్మనిచ్చే జననీ..
నవ మాసాలు గర్భాశయంలో పెంచి జన్మనిచ్చిన ప్రేమమూర్తి “అమ్మ”
పాలు త్రాగించి,ఆహారం తినిపించి,చిన్ని చిన్ని అడుగుల నుండి పెద్దయ్యే వరకు తన ప్రేమతో పెంచుతుంది “అమ్మ”
పుట్టాక మనల్ని కంటికి రెప్పలా కాపాడేది “అమ్మ”
నిస్వార్థ ప్రేమ మూర్తియే “అమ్మ” పుడమికి ఉన్న ఓర్పే “అమ్మ”
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూలం “అమ్మ”…
ప్రపంచంలోకెల్లా తీయనైన పదం “అమ్మ”
బ్రహ్మదేవుడు సృష్టించిన అపురూపమే “అమ్మ”
“అమ్మ” అంటే ఓ అనుబంధం…
“అమ్మ” అంటే ఓ ఆప్యాయత
“అమ్మ” అంటే ఓ ఆత్మీయత ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే “అమ్మే”
పసిగట్టి కడుపు నిండా అన్నం తినిపించే మాతృమూర్తి మమతానురాగాల రూపమే “అమ్మ”
త్యాగానికి ప్రతిరూపమే ‘అమ్మ’
ప్రత్యక్ష దైవమే “అమ్మ”…

సింగీతం సంతోష్ కుమార్
కామారెడ్డి జిల్లా

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!