అమ్మ

Must read

అందమైన ముఖము చూడాలంటే అమ్మ వదనం.!
ఆమె లేని చోటు కాలేదు సదనం.!
చక్కగా రాయచ్చు తనకై లక్షణమైన కవనం.!
ఆమె చేతి ముద్ద తినుటకు చేశాము కదనం.!
చెప్పాలి అంటే ప్రతి అమ్మ జీవితం నిస్వార్థ కథనం.!

పిల్లల భర్తల మధ్య నలిగిన సంసార మధనం.!
ఒక్క అమ్మకే ఇచ్చాడు బ్రహ్మ ఆసహనం.!
ఈటెలాంటి మాటల ప్రయోగాల్ని చేయాలి దహనం.!
ఇలపై నడిచే దేవతని స్వాగతించే భువనం.!
అమ్మ ఉన్న ఇల్లే కదా ఆనంద భవనం.!

పరిమళించు త్యాగ రూపు హృదయం.!
కంటే శ్వాసతో సహా అంతా అమృతమయం.!
ధీరవనితగా చేపట్టే బాధ్యతల సమరం!
కురిపించేవు ఏ వేళైనా అమృత వర్షం.!
నీ సేవ చేసుకుంటే కదా జన్మ ధన్యం.!

యలమర్తి మంజుల, విశాఖపట్నం

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!