కవిత అంటే…

Must read

కవితంటే మాటల మురిపెంగా
మనసును మెల్లగా మెప్పించాలి
మల్లెపూల పరిమళంలా
మాటల మధ్య మాధుర్యం జార్పించాలి।

కవితంటే మెరుపుల జిలుగుగా
అక్షరాల్లో ఆలోచనలు మెరిపించాలి
ఒక్క పదమే పిడుగైపోయి
నిద్రలోనూ చైతన్యం నింపేలాగుండాలి।

కవితంటే మత్తును దూరం చేసే
మధురమైన జ్ఞాపకాల మందు కావాలి
చీకటిలో చతికిలపడక
దారిచూపే దీపమై నిలవాలి।

కవితంటే మాధుర్య గానం
మనసు గూటిలో గూడు కట్టాలి
చల్లని గాలిలా చేరి
చింతలను మెల్లగా దూరం చేయాలి।

కవితంటే హృదయాన్ని తట్టాలి
మనిషి మనసును మెలిపెట్టాలి
నిశ్శబ్దంలో మాటలై
నిజాలను నిద్రలేపాలి।

కవితంటే మానవత్వ దర్పణం
మనుగడకు మార్గం చూపాలి
కన్నీటి బొట్టులోనూ
కరుణ వెలుగులు నింపాలి।

కవితంటే కేవలం పదాలు కాదు
ప్రాణం పొసిన భావాల ప్రపంచం
మనసు నుంచి మనసుకు చేరే
మానవత్వపు మధుర సందేశం।

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,
భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!