నీకోసమె నే జీవించునది!

Must read

నీ కోసమె నే జీవించునది
ఒకరికోసం ఒకరున్నారనే భావన
మనఃశాంతిని ఇచ్చే ఆనందం
ఏ పరిస్థితుల్లో ఉన్నా
ఒంటరిని కాదనే నమ్మకం
ఆ భరోసా కలిగినప్పుడు
ధైర్యం పొందినప్పుడు
ఎంతో ధీమాగా నిర్భీతిగా ఉండే అనుభూతి.
మన వల్ల ఒకరు అలాంటి
శాశ్వత అనుభూతి పొందితే
అది మనకు అపురూపమైన అనుభవం
జీవితంలో ఇలాంటి సందర్భాలు
మన మధ్యలో మనలోనే ఉన్నాయి
కానీ..! మనకు అవి అపరిచితం
అర్ధం అయినప్పుడు అత్యాద్భుతానందం
మనలో నిక్షిప్తమైన అమృతమయి
ఆత్మను గ్రహించలేక పోతున్నందుకు సిగ్గు పడదాం
బిడ్డలు కడుపునిండా తింటే
తానే తిన్నంత తృప్తి తల్లికి
బిడ్డ కాలిలో ముల్లు గుచ్చుకొంటే
తన గుండెల్లో గునపం దిగినట్లు తల్లడిల్లుతుంది
అన్నీ మనకు అనుకూలించనవసరం లేదు
మనలో తేమ ఉంటే అన్నీ సానుకూలతలే
మాతృ హృదయం అందరికీ ఉండాలి
అది మన హృదయ నాభిలోని కస్తూరి
ఆ పరిమళాన్ని ఆస్వాదిద్దాం అందరికీ పంచుదాం
అదొక అపురూపం అద్భుతమైన ఆత్మతృప్తి
స్వామికార్యం స్వకార్యం ఒకే పనిలో
ఇమిడి ఉంటే అంతకంటే అదృష్టం ఏముంది..!

లోడె రాములు
7382804913

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!