మా తెలంగాణ తల్లికి మల్లెపూల దండ
మా అమరవీరులకు నిలువెత్తు దండాలు
దశాబ్దాల తెలంగాణ చరిత్ర నిఘంటువు
తరతరాల చరిత్ర చెదరిపోని ఘనత
సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు
ఆత్మ బలిదానాలు చిల్లిన రక్తపు ధారలు
ధర్నాలు దీక్షలు సకలజనసమ్మెలు
ఓవెత్తున పోరాటం ఊరువాడ కదిలెను
గల్లి నుండి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం
పార్లమెంటులో బిల్లు తెలంగాణ స్వరాష్ట్రం
కళాకారుల ఆటపాటలు కదిలించను ఊరు వాడ ప్రజలను
కుల మతం బేదములేని పోరాటం తెలంగాణ స్వరాష్ట్రం
అమరుల ఆశయాలకు నిలువెత్తు నిదర్శనం
ఈ దశాబ్దాల తెలంగాణ కావాలి బంగారు తెలంగాణ
పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపాలి
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కు
శతకోటి దండాలు జై తెలంగాణ
పుల్లే మల్లేశం యాదవ్





