జై జై అంబేద్కరా
జయహో అంబేద్కరా…
అణగారిన బ్రతుకులో
ఉదయించిన కిరణమా …
వెలివాడలో జన్మించిన
పొద్దుపొడుపువు
అందుకొ మా ఉద్యమాల
జోహార్లు
రాజ్యాంగ నిర్మాణ రూపకల్పవు
భారతావనిలో అక్షర నిఘంటువు
జై జై అంబేద్కరా…
జయహో అంబేద్కరా…
ఈ అవనిలోన నీ చరిత మరువలేనిది
బహుజన బతుకుల్లో వెలుగు దీపమా
ప్రపంచ దేశమున నీకు సాటి లేరు
నీ ఆశయాల మార్గంలో వారధులం
జై జై అంబేద్కరా..
జయహో అంబేద్కరా…
ఊరి అవతల గుడిసెలో నీ బాల్యము
గుడికి బడికి వద్దంటూ ఆంక్షలున్నో వేసెను
అవమానాలు తలవొంపులు ఎన్ని ఎదురు వచ్చిన
లక్ష్యాన్ని మరవకుండా పయనం సాగించావు
జై జై అంబేద్కరా..
జయహో అంబేద్కరా…
రాజనీతి శాస్త్రాన్ని పర్యవేక్షణ చేసి
నాయశాస్త్రకోవిదుడిగా పేరొందినవ్
అంటరానితనము నిర్మూలనకై
ఉద్యమాలు చేస్తూ జనజాగృతి పరిచినవు
జై జై అంబేద్కరా..
జయహో అంబేద్కరా…
రాజకీయ ప్రస్థానం నాయ శాస్త్ర మంత్రివి
దశ దిశ నిర్దేశన నీ చూపుడు వేలు
జనం మేలుకొలుపుకై నీ సూచన
మూఢనమ్మకాలపై నీ మాటే ఒక మంత్రం
జై జై అంబేద్కరా..
జయహో అంబేద్కరా…
అవకాశవాదులు కులం పిచ్చి నాయకులు
నీ విగ్రహాలు పైన రాజకీయం చేస్తుండ్రు
ఎ ఒక్కరి వాడు కాదు అంబేద్కర్ డు
మన అందరి వాడు అంబేద్కర్ డు
జై జై అంబేద్కరా..
జయహో అంబేద్కరా…
రచన
పుల్లె మల్లేశం యాదవ్





