సంప్రదాయములకు పుట్టిల్లు!
ఎన్నో కళలకు మెట్టినిల్లు!
గత వైభవపు హరివిల్లు!
ఈ చారిత్రక కట్టడాలు, ఖిల్లాలు!
కందికల్ గుట్టలు, బాలఘాట్లు!
కృష్ణమ్మ గోదారి పరవళ్లు!
బతుకమ్మ, మేడారం, బోనాలు!
సమ్మక్క సారక్క జాతరలు!
పీర్ల, మొహ్రం పండుగలతో ఐకమత్యాలు!
ప్రత్యేక తెలంగాణా వచ్చేనురో!
రైతుకు కరెంట్ ఉచితంరో!
రైతు బంధు కల్యాణలక్ష్మి పధకాలురో!
భగీరధయత్నంతో నీటిని అందించెరో!
విద్యతో రాష్ట్రo అభివృద్ధి చెందెనురో!
అలంపురం జోగులాంబ శక్తి పీఠములు!
రుద్రమ,భీమన్న పోరాటాలు!
కాళోజి కవితల సుగంధాలు!
సి. నా. రె, గద్దర్, ఎంకన్న పాటలు!
బహుభాష కోవిదుడుగా పి. వి స్ఫూర్తులు!
పాలపిట్ట పరుగులతో తెలంగాణా నవ్వులు!
ఎందరెందరో త్యాగ ఫలం!
ప్రజా సంక్షేమనికి మూలబలం!
చక్కని ఆశలకు ఆశయాలకు అంకురo!
నేటి “బంగారు తెలంగాణా” నినాదం!
యలమర్తి మంజుల
విశాఖపట్నం





