‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు. వయసు చిన్నది పోనీలే పాపం అనుకోవడానికి వీల్లేదు. యువత బాధ్యతగా వ్యవహరించాలి. మీరు బలంగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలోపవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు.కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన గంజాల అరవింద్ బాబు అనే వ్యక్తి కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బందిపెడుతున్న ఆకతాయిల వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై స్పందించారు.
కనస్ట్రక్షన్ కంపెనీ చేతిలో మోసపోయిన భవానీ అనే మహిళ, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై మహ్మద్ అన్సర్ అనే వ్యక్తి, కళాశాలల్లో గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై శ్రీనివాస్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి, కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం. హరీష్ బాబు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు, వాహనాలతో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారుతోంది. దీనివల్ల అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్ లు సైతం గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఈ కూడలిలో శాశ్వతంగా ఒక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాకినాడ కార్పోరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లు,ప్రత్యేక క్లినిక్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జాహ్నవి అనే ట్రాన్స్ జెండర్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో 45 సెంట్ల భూమిని కోల్పోయానిని కిర్లంపూడి మండలానికి చెందిన కాకిలేటి వీర్రాజు అనే వ్యక్తి తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు చదువు పూర్తయ్యాక రాష్ట్రంలోనే ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పలువురు విద్యార్ధులు విన్నవించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టేందుకు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరీంధ్రప్రసాద్, ఎస్పీ జి.బిందు మాధవ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.





