ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు

Must read

రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అథవాలే) సౌత్ ఇండియా ఆధ్వర్యంలో పార్టీ సౌత్ ఇండియా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటస్వామి హాజరవడం జరిగింది.

ప్రముఖ తెలంగాణ వాది జగన్నాధం ప్రవీణ్ కుమార్ రచయిత, సంగ సేవకుడు గెస్ట్ స్పీకర్ గా ప్రసంగించారు. అలాగే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ ప్రసంగం ఆసాంతం ఆకట్టుకుంది. పార్టీ సౌత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలను సృష్టిస్తూ మనల్ని మనలా బ్రతకని వ్వకుండా ఇంకా కూడా ఆంధ్ర ప్రజలు (కొంతమంది) తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలు మాత్రం భయపడరని తన్ని తరుముతారని హెచ్చరించారు. అలాగే పార్టీ సౌత్ జనరల్ సెక్రటరీ గొల్లపల్లి నాగరాజు గారు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులకు రావలసిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు అలాగే ఉద్యమకారులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు కానీ వారికి ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.

మరి ఈ మధ్య కాలంలో వారు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరించి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ మహిళా ఇంచార్జి రోజారాణి గారు మాట్లాడుతూ ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితి ఎలాగే జరుగుతూ ఉంటే మళ్లీ ఉద్యమం చేయడం ప్రాంభం అవుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సౌత్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సచిన్ గౌడ్, పరమేశ్వరి,శ్రీనివాస్, వంశీ, కూకట్పల్లి నియోజకవర్గ సమన్వయకర్త కరుణ్ నాయుడు,బీసీ నేత గోవిందు, సూర్యాపేట జిల్లా సమన్వయకర్త శంకర్ గౌడ్, ఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!