ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. సుమారు 40 వేల మందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
టెలికాన్ఫరెన్సు ద్వారా క్షేత్ర స్థాయి అధికారులు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడారు. ముఖ్యమంత్రితో కిందిస్థాయి ఉద్యోగులు మాట్లాడే అవకాశం కల్పించినందుకు పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. కాకినాడ జిల్లాకు చెందిన ఉద్యోగి గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేసారు. స్పందించిన సీఎం మంచి సూచన చేశారు.
అమలు చేస్తామంటూ సదురు ఉద్యోగికి చెప్పారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో టాప్3లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విధ్వంసమైన రాష్టాన్ని గాడిలో పెడుతున్నాం. అందరి సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతీ ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు గాడిలో పడ్డాయని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలు పెట్టుకున్నాం.
పది సూత్రాలను అమలు చేస్తున్నాం. 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం... 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయి. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, ఆమ్కా వంటి కీలక ప్రాజెక్టులు వచ్చాయి...త్వరలో బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుకు శంప్రకుస్థాపన చేసుకుంటాం. ఆమ్కా ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తిబెంగళూరు మధ్య ఎరో స్పేస్ సిటీగా అభివృద్ధి జరుగుతుంది. టీంగా పని చేయాలి… అభివృద్ధి సాధించాలి.
ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్ బ్యాక్ లెక్కలే దీనికి నిదర్శనం. ప్రభుత్వ సేవల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అగ్ర భాగాన నిలిచింది. ప్రభుత్వ సేవలు అందించడమే కాకుండా… ప్రజలతో సఖ్యతగా మెలగుతుండడం వల్లే పెన్షన్ల పంపిణీ టాప్ లో నిలిచిందని అన్నారు.
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏమైనా గ్యాప్ ఉంటే.. జిల్లా యంత్రాంగం అలెర్ట్ కావాలి. జిల్లాల్లో 80 శాతం మంది పనితీరు బాగుంది.
అభినందనలు. ప్రతి ఒక్కరి పనితీరును విశ్లేషిస్తున్నాం… బాగా పని చేసిన వారిని గౌరవిస్తాం.. గుర్తిస్తాం. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక`ఆర్థికేత సమస్యలుగా విభజించుకుని పని చేయాలి. ఆర్థికేత సమస్యలను 100 శాతం పరిష్కరించాల్సిందే. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని చోట్లా రావాలి. ంఓఅం ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులిచ్చి… శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. ంఓఅం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు చూసి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అవినీతి అనేది కన్పించకూడదు.. పారదర్శకతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి.
నెల్లూరు కలెక్టర్ చేసిన ప్రయోగాన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో నాలుగు సార్లు పర్యటనలు చేసేలా ప్రణాళికలు రూపొందించాం. తాగునీరు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై క్షేత్ర స్థాయిలో మరింత అలెర్టుగా ఉండాలి. చిన్నచిన్న పనులైనా వెంటనే స్పందించండి.. సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలగాలి… అదే బ్రాండుగా మారాలి. తక్కువ ఖర్చుతో ఇంపాక్ట్ చూపించేలా పనితీరు మెరుగుపర్చుకోవాలి. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని అన్నారు.





