నా గుండె నిండా దేశభక్తి
నా జీవితానికి ఇదే తృప్తి
మన కష్టకాలం మన కర్మ ఫలితం
మనిషి నమ్ముకున్న ఈ ధర్మం
మన ప్రజాస్వామ్య దేశంలో
కోట్ల కొలది డబ్బు సంపాదించేటోనికి
ఓట్లు కొనేవాడికి తప్ప
పేదవానికి రైతులకు ఇంకా ఎప్పటికీ న్యాయం జరగదేమో.. మన పవిత్ర భారత దేశంలో
ఈ ప్రపంచంలో అవినీతి అనే కటిక చీకటిని కమ్మేసింది
ఎక్కడ చూడు లంచం లంచం
బహుశా పేదవాని రక్తం
బీద వాళ్ళ మాంసం పీక్కు తింటున్న రాబందులు!
నాలుగు దిక్కుల వ్యాపించింది అవినీతి అనే అంటూ వ్యాధి
దీనికి మందు లేక భవిష్యత్తులో తరతరాలకు వ్యాపించి మానవత్వాన్ని చంపేస్తుంది!!
సాటి మనిషి మృగముగా మారి వీపు మీద రాచ పుండు వలె
అక్షర జ్ఞానం ఉన్నాడు అవినీతి
(లంచం అనే ఆశ పుట్టి)
ప్రియత ప్రజలను దోచుక తింటున్న ప్రబుద్ధులు!!
ఏ టు జెడ్
ఒక పాత్ర దారి
ఒక సూత్ర దారి
పేదవాడు ఎటు చూసినా తన జీవితం ఎడారి
నిత్యం ఒక అగ్ని పరీక్ష
కాలే కడుపుకు కంచంలో బువ్వ విలువ
పేదవాన్ని చెమట చుక్క విలువ
విలువ తెలియని ప్రబుద్ధులు
భూమి మీద బ్రతికే టందుకు మనిషిగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది
అధికారం ఉంది కదా అని అహంకారం వద్దు ధనం డబ్బు ఉన్నవానికి గుణం గుడ్డిదోగిపోతుంది!!
బహుశా స్మశానమే అందరికీ
అందమైన ఇల్లు అని మరిచిపోతున్నాడు మనిషి!!
రచయిత
కొమురవెల్లి నరసింహులు
తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత





