ఆర్టిస్టులు నేరస్తులా, ఉగ్రవాదులా? రేణు దేశాయ్

Must read

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ పై రేణు దేశాయ్​ మరోసారి ఘాటుగా స్పందించారు. ఆమె తాజాగా షేర్ చేసిన వీడియోలో, తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను “భావ ప్రకటన స్వేచ్ఛ” అంటే ఏమిటో వివరిస్తూ.. ఈ విడియోను షేర్​ చేశారు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ, “మీ దృష్టిలో ఆర్టిస్టులు నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన మాటలతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి?” అని సూటిగా ప్రశ్నించారు.ఇంకా ఇలా అన్నారు. సెలబ్రిటీల అభిప్రాయాలు నచ్చకపోతే, వారిని అన్‌ఫాలో చేయడం మాత్రమే సరైన మార్గం. కానీ వ్యక్తిగత జీవితంపై నిస్సారమైన దాడులు, అవమానాలు, నిందలు చేయడం సంస్కారం కాదని హితువు పలికారు.

చాలా మంది నెటిజన్లు తమ దాడులను “భావ ప్రకటన స్వేచ్ఛ” కింద జస్టి చేసుకుంటున్నారని. కానీ అసలు, నిజమైన ఫ్రీ స్పీచ్ అంటే ఆ వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు మాత్రమే కాని మరొకరిని బాధించడానికీ, వేధించడానికీ అవకాశం లేదని ఆమెకు అన్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఉన్న హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారని ఇది వ్యక్తిగత గౌరవమా లేక నైతిక బాధ్యతల మధ్య తేడానా అర్థం కావడం లేదు.

ఈ సంఘటన సోషల్ మీడియా కాబట్టి కేవలం రేణు దేశాయ్ కు మాత్రమే పరిమితం కాకుండా, అన్ని సెలబ్రిటీలకు సంబంధించిన సమస్య అని చెప్పవచ్చు. ఇటీవల, వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు, ట్రోలింగ్, మరియు నిందించడం ఒక సామాన్యమైపోయింది. దీనివల్ల మానసిక ఒత్తిడి, స్ట్రెస్, మరియు సామాజిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు బాధ్యతతోనే స్పందించాలని హితువు పలికారు. సైబర్ హరాస్మెంట్ అనేది చట్టపరమైన సమస్యగా పరిగణించబడుతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు.

కష్టపడి గౌరవంగా పని చేస్తూ జీవిస్తున్నకళాకారులను టార్గెట్​ చేయడం మానుకోవాలని కోరారు. తనను దూషించే వారిపై కేసులు పెట్టి అరెస్టు చెయిస్తున్న విషయాన్ని కూడా నెటిజన్లకు గుర్త చేశారు. యువత తమ ప్రవర్థను మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలన్నారు, అనవసరపు విమర్శలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆమె నెటిజన్లను కోరారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!