సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి : వైయస్‌ జగన్‌ డిమాండ్‌

Must read

విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్‌తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందని ఆయన వెల్లడించారు.

కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్‌ చేశారన్న వైయస్‌ జగన్, విజయవాడ సీపీ, డీజీపీతో సహా, అందరిపై మర్డర్‌ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి మాట్లాడిన ఆయన ఓదార్చారు.

అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీపరిధి. ఇదే పరిధిలోనే ఈ పోలీసు స్టేషన్‌ ఉంది. ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోదిస్తున్న దృశ్యం. ప్రతీ ఒక్కరినీ ఒకటో ఆలోచన చేయమని అడుగుతున్నా.

చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. ఇదే పోలీసు స్టేషన్‌ కమిషనరేట్, ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఇది.

మే మాసంలో ఒక ఘటన కాదు. సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్‌ అనే మరో పిల్లాడిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్‌ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది.

ఆరోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’.. అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి ప్రతీ రోజూ తనకు సమాచారం అందే కొద్దీ, ఆ స్టేషన్‌లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్దమై అదే పోలీసు స్టేషన్‌ కు ప్రతీ రోజూ వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.

జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్‌ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్‌ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు. అప్పుడు కచ్చితంగా నా కొడుకుకు ఏదో జరిగిందని ఆ తల్లికి అర్దమై జూన్‌ 2న హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది.

నా కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని పిటిషన్‌ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐని సస్పెండ్‌ చేశారు. ఆ సీఐని ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పగలరా? చంపేశాడనే కదా సీఐని సస్పెండ్‌ చేసింది. అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే ఆ సీఐ పరిధిలోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ ను కాపాడుతూ డీజీపీ.. మొత్తం అందరికీ తెలిసి స్టేషన్లో జరిగిన ఒక హత్య మాత్రమే కాదు.

పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ, కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని, వీడియో ద్వారా తన మెసేజ్‌ ను తెలియజేసిన పరిస్ధితి. నేను ఒకటే చెప్తున్నాం. సస్పెన్షన్‌ అంటే ఏంటి?. టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే హత్య చేస్తే, గోళ్లు పీకి చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్‌ చేశారు.

ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే.. ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ ను, డీజీపీని మర్డర్‌ కేసు పెట్టి ఛార్జ్‌ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్‌ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది అని ప్రశ్నించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!