కదలాలి

Must read

పేజీల నింపుటకై కలాలు కదలాలి
బొమ్మల అందాలకై కుంచెలు కదలాలి

రాగాల మధురిమకై గళాలు ఎత్తాలి
కవితల కూర్పుకై అక్షరాలు కదలాలి

అర్థాల వెలుగులకై పదాలు మెరవాలి
ఉల్లాస ఊపులకై ఊహలు కదలాలి

కల్పనలు పూయుటకు భావాలు పుట్టాలి
గమ్యాల చేరుటకై పాదాలు కదలాలి

జలాశయాల నింపుటకు నదులు పారాలి
కాలగమనముకు గడియారాలు కదలాలి

చీకట్లు తరుముటకై దీపాలు వెలగాలి
జగతి వెలుగుకై రవికిరణాలు కదలాలి

ప్రేమలను పంచుటకై హృదయాలు మెదలాలి
మానవతను నిలుపుటకై మనసులు కదలాలి

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!