గెలుపు నేర్పే పాఠాలు

Must read

గెలుపు అనేది సునాయాసంగా దరిచేరిది కాదు
అలా అని అందని ద్రాక్ష అంత కన్నా కాదు

కష్టే ఫలి అని అన్నారు
విసుగు చెందక కృషి చేస్తే తప్పక విజయాన్ని అందుకుంటాము

ఒక రాయి ఎన్నో ఉలి దెబ్బలు తట్టుకొని నిలబడితేనే కదా
చక్కని శిల అయ్యేది

ఒక చిన్న బీజం పుడమిని చీల్చుకుంటూ
ప్రకృతిలోని ఇబ్బందులు ఎదురుకుంటేనే కదా

తన ఉనికిని కాపాడుకుంటూ
చక్కని ఫలాలని అందించేది

పసి పిల్లలు కింద పడినా
మరలా లేచి నడవడానికి ప్రయత్నం చేసినట్టు

ఎన్ని అవరోధాలు ఎదురైనా
చిరునవ్వుని కోలిపోకుండా ఉంటే ఓటమికే వణుకు పుట్టి విజయాన్ని ఇస్తుంది

సహనం అనే వృక్షం ఒక వేర్లు చెడుగా ఉన్నా
విజయం అనే తీపి ఫలాలని అందించి మన బాధలని మాయం చేస్తుంది

ధృడ సంకల్పం, క్రమశిక్షణ, ఆత్మ స్టైర్యం ఉంటే
ఎన్నటికైనా విజయం దరిచేరుతుంది

వజ్రనికైనా సాన పెడితేనే కదా అది మెరుస్తుంది
అలానే మనలోని కళలని గుర్తించి ప్రయత్నం చేసి అనుకున్న గమ్యం చేరుతాము

గెలిచాము అని పొంగిపోక
ఓడిపోయాము అని క్రుంగిపోక

గర్వం దరిచేరనియక
ఈర్ష్య ద్వేషం స్వార్థం వదిలి

స్నేహాభావంతో మంచి నడవడికతో
అందరితో మంచి మనిషిగా ఉంటే అదే సగం గెలుపు

మరణించినా నలుగురి జ్ఞాపకాలలో
పది మంది హృదయాల్లో ఎప్పటికి బ్రతికి ఉంటే అదే నిజమైన గెలుపు

అప్పె షర్మిల

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!