సింహాచలం చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు..ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సమావేశం

Must read

విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరగనున్న వార్షిక చందనోత్సవం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది.

ఈ ఉత్సవాన్ని పూర్తిగా నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

సాంప్రదాయం ప్రకారం చందనోత్సవం రోజున అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలుత స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామని మంత్రి వివరించారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ విధానం గతంలోనూ అమలులో ఉందని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఉత్సవ ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో హోం మంత్రి అనిత, మరో మంత్రి బాలవీరాంజనేయస్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భక్తుల దర్శనాల కోసం ఈసారి స్లాట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులు ముందుగా టికెట్ బుక్ చేసుకున్న సమయానికి అనుగుణంగా ఆలయానికి రావాలని సూచించారు.

ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. క్యూలైన్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దర్శనాలను నిర్వహిస్తామని చెప్పారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!