‘జగన్ కు మంత్రి నారా లోకేశ్ అంటే భయం. అందుకే, ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు రా అని మంత్రి లోకేశ్ సవాల్ చేసినా జగన్ భయపడి రావడం లేదు.మళ్లీ మరోసారి సవాల్ చేస్తున్నా. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉంటే. అసెంబ్లీకి రా చర్చిద్దాం.మంత్రి నారా లోకేశ్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్ కు, వైసీపీ నేతలకు లేదు.గొడ్డలి పార్టీ చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో రూ.18 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మంత్రి సవిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా పది ఎంజేపీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. రాయలసీమలో 5, ఉత్తరాంధ్రలో 5 ఎంజేపీ గురుకులాలను ప్రారంభించామన్నారు. వాటిలో గుంతకల్లులో అధికంగా ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంజేపీ గురుకుల పాఠశాలను ప్రారంభించామన్నారు.
అయిదేళ్ల వైసీపీ పాలనలో బీసీల విద్యను జగన్ గాలి కొదిలేశారని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎంజేపీ గురుకులాల భవనాలు 70 నుంచి 80 శాతం పూర్తయినా జగన్ పట్టించుకోలేదన్నారు. చివరికి పులివెందులలోని ఎంజేపీ గురుకులానికి సైతం నిధులు మంజూరు చేయలేదన్నారు. తరవాత వచ్చిన కూటమి ప్రభుత్వం అర్థాంతరం నిలిచిపోయిన ఎంజేపీలకు నిధులు మంజూరు చేసి, ఆయా భవనాలను పూర్తి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గుంతకల్లులో రూ.18 కోట్లతో నిర్మించిన విశాలమైన భవనాలను నిర్మించి, బీసీ బిడ్డలకు అంకింతం చేశామని మంత్రి సవిత తెలిపారు.
సీఎం చంద్రబాబునాయుడుకు డీఎస్సీలు నిర్వహిచడం కొత్త కాదని మంత్రి సవిత తెలిపారు. లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆయన సొంతమన్నారు. అయిదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను ఊసూరు మనిపించారని జగన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారన్నారు. 2025 మెగా డీఎస్సీని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దిగ్విజయంగా నిర్వహించారన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో ఇప్పుడు అక్రమాలు జరిగాయంటూ జగన్, గొడ్డలి పార్టీ డ్రామాలు ఆడుతోందన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అంటే జగన్ కు భయమని, అందుకే ఆయన రాజీనామా చేయాలంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ దేనికి రాజీనామా చేయాలి.తల్లికివందనం నిధులు అందజేసినందుకా. సంస్కరణలు తీసుకొచ్చి విద్యా శాఖను గాడిలో పెట్టినందుకా. సన్నబియ్యంతో విద్యార్థుల కడపునింపుతున్నందుకా…16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినందుకా.? అని నిలదీశారు. ఆధారాలు ఉంటే చర్చకు రావాలని మంత్రి లోకేశ్ సవాల్ చేసినా జగన్ భయపడి రావడం లేదన్నారు. మరోసారి సవాల్ చేస్తున్నామని, మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉంటే… అసెంబ్లీలో చర్చకు రావాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్ కు, వైసీపీ నేతలకు లేదని మంత్రి సవిత అన్నారు.





