తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైకోర్టు తన తీర్పులో ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ఆ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ తన విచారణలో అవసరమైన నిబంధనలు పాటించలేదని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
ప్రధానంగా, సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ప్రక్రియాపరమైన లోపాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
ఈ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని వ్యాఖ్యానించింది. సెక్షన్ 8 కింద నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, ఎస్.కే. జోషి వంటి ప్రముఖులకు ఈ తీర్పు ద్వారా ఊరట లభించింది. కమిషన్ నివేదిక ఆధారంగా వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు ఆదేశించడం వీరికి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది.
2024 మార్చిలో పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ పిటిషన్లపై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.. ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వ్ చేయగా.. ఈ నెల 8న తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు.. ఆ తర్వాత నేటికి (ఏప్రిల్ 22) కు వాయిదా వేయగా.. ఎట్టకేలకు ఆ తీర్పు వెల్లడించారు.





