ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు గిరిరాజు సింగ్ కృష్ణాజిల్లా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అటు నుంచి నేరుగా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఉన్న స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు.
రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవిత , స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండి వల్లభనేని సుధాకర్ చౌదరి మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి సాడర పూర్వకంగా స్వాగతం తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్ టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ తదితర పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు వచ్చానని అందులో మొదటి రోజు విజయవాడలోనూ రెండవ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రినీ కలిసి, ఆంధ్రప్రదేశ్‌ను ఒక జౌళి రంగ ప్రముఖ రాష్ట్రంగా ఎలా అభివృద్ధి చేయవచ్చనే విషయంపై చర్చిస్తామన్నారు. ప్రముఖ. ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న రాష్ట్రం అన్నారు. ముఖ్యంగా పత్తి (కాటన్) విషయంలో ప్రపంచవ్యాప్తంగా హెక్టారుకు 2000 కిలోల దిగుబడి వస్తుండగా, భారతదేశంలో మాత్రం సగటు 450 కిలోల మాత్రమే వస్తోందన్నారు.
ఈ పరిస్థితిని ఎలా మార్చాలి విత్తనాల (సీడ్స్) విషయంలో ప్రత్యేక విధానం అవసరమా? రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి అత్యధికంగా ఎలా పెంచాలి? అనే అంశాలపై చర్చించామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల ఒక క్లస్టర్‌ను మేము ఆమోదించామన్నాడు. మరో క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. చేనేత రంగం రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి మంత్రితో, ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందన్నారు. .
ఇప్పటివరకు చేనేత రంగానికి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్, ఇకపై జౌళి రంగంలో కూడా ప్రముఖ కేంద్రంగా ఎదగాలున్నది తమ లక్ష్యమన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తాను విశాఖపట్నంలో గ్లాస్ ఫైబర్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నానన్నారు. గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, గ్రాఫీన్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
భారత ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్ల పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) ప్రకటించిందన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాటా పొందాలని ముఖ్యమంత్రినీ కోరబోతున్నామన్నారు. .. మొత్తం రూ.11 వేల కోట్ల ప్రోత్సాహకాల్లో రాష్ట్రం అధిక భాగస్వామ్యం పొందడం అవసరమన్నారు.. ఈ విషయాన్ని చెప్పేందుకే తాను వచ్చానని. ఇంకా కొన్ని చిన్న చిన్న అంశాలపై కూడా చర్చిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి సిఈఓశివకుమార్, డైరెక్టర్ గిరీష , కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీరబ్ కుమార్, కేంద్ర జౌళి కార్పొరేషన్ గుంటూరు డివిజనల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ధనశేఖరన్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ, సాయిప్రసాద్, డిఐసి జిఎం వెంకటరావు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జ్యోతి, డి ఎల్ డి ఓ సునీత శర్మ , డిఎల్ పి ఓ సంపత్ కుమారి, గన్నవరం డిఎస్పి శ్రీనివాస్, స్పెంటెక్స్ డైరెక్టర్ రవికుమార్, స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ పున్నయ్య చౌదరి తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.





