నేను తెలంగాణ మట్టి బిడ్డను :ఈటెల

Must read

నేను తెలంగాణ మట్టి బిడ్డను. రాష్ట్రం కోసం కొట్లాడిన వాడినని ఎంపీ ఈటెల అన్నారు. సమైక్య శాసనసభలో గొంతు విప్పి తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి అందరినీ కన్విన్స్ చేసినవాడినని, రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాట మాడాలని ఏ పార్టీ చూసినా.. ఎవడు చూసినా.. నేను చూస్తూ ఊరుకోనన్నారు. ముందు అర్థం చేయించే ప్రయత్నం చేస్తా.. అవగాహన చేయించే ప్రయత్నం చేస్తాను.. లేనిపక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తానని హెచ్చరించారు.ఎవరి మెప్పు కోసమో.. ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో.. ఎవరో పలికిస్తేనే పలుకే వాళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశితులం. మాకు సొంత జ్ఞానం, అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాన్నన్నారు. రిమోట్ కంట్రోల్ లాగా మాట్లాడే వాన్ని కాదు .. మా మీద కామెంట్ చేసే నీచులకు నేనేంటో తెలియజేస్తును. ఉత్తర తెలంగాణ బిడ్డగా ఎస్సారెస్పీ ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఆనాడు జొన్న అన్నం తిని బ్రతికినం. ఎస్సారెస్పీ వచ్చిన తర్వాతనే వరి బువ్వ తిన్నామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు 3,500 ఎకరాలు పారిస్తే తెలంగాణలో ఒక టీఎంసీకి 12వేల ఎకరాలు ఎలా పారుతుంది ? అని మేము ప్రశ్నిస్తే మీది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని సమాధానం ఇచ్చారు.

ఎస్సారెస్పీ కాలువల కింద బోర్లు బావులు లేకుండా వ్యవసాయం చేయలేరు. ఇది ఇక్కడి వ్యవసాయం మీద అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఎస్సారెస్పీ కాలువలు తెంపి మా పొలాలు పారించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ నీళ్లు ఏనాడు వరంగల్ దాటలేదు.గోరటి వెంకన్న పల్లెలో పల్లేర్లు మొలిచిన పాటలు పాడుకున్నాము.నీళ్లు, నిధులు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో భాగంగా తమ్మిడి హట్టిలో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదించారు. ఎల్లంపల్లికి ఆనాడే పునాది పడింది. కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ద్వారా కాలేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపాదించింది. నీళ్లు ఉన్నవే ప్రాణహితలో కాబట్టి లక్ష్మీబరాజ్, అన్నారం, సుందిళ్ల నిర్మాణం జరిగింది. ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరు. పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నా .. ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నా.. మాకు ఒక్క పంటకు కూడా నీరు సరిగా అందలేదన్నారు.

కాలేశ్వరం లింక్ అయిన తర్వాత రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు కరీంనగర్, వరంగల్, కొంత నల్గొండ. కాలేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు ఎవరు, కమిషన్లు ఎంత తిన్నారు, డిజైన్లు తప్పా కరెక్టా అని నేను మాట్లాడటం లేదు.. కానీ కాలేశ్వరం కట్టడమే తప్పు అనేదాని గురించి నేను మాట్లాడుతున్నాను.బండబారిన తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలా వద్దా.ఎల్ నినో వల్ల భయంకరమైన కరువు వచ్చే విధంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు చెప్తున్నాయి. లక్ష్మి బారాజీలో నీళ్లు నింపమని నేను కోరడం లేదు. ఎన్డీఎస్ఎ ఏం నివేదిక ఇచ్చింది.. ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు.. ఎందుకు రాజకీయం చేస్తున్నారు.. ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఎందుకు మట్టి కొడుతున్నారు. హైదరాబాద్ కి నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నారు. ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎలా అని అడుగుతున్నాను ? ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి రాలేదు. పని చేసే పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్తున్నాన్నారు.

తెలంగాణలో చాలామంది నిశ్నాతులైన ఇంజనీర్లు ఉన్నారు. వారితో మీటింగ్ పెట్టి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని సమీక్ష చేయవచ్చు కదా. నిన్న కరీంనగర్ పోతే ఒకసారి పత్తి విత్తనాలు వేస్తే మొలవలేదు మళ్లీ ఇంకోసారి వేస్తున్నాము.. టాంకర్లతో కుండలతో నీళ్లు పోస్తున్నామని వారు వాపోతున్నారు. ఒక్కో సారికి నాలుగు వేల రూపాయల ఖర్చు అవుతున్నాయి. మళ్ళీ పాత రోజులకు గుర్తు వస్తున్నాయని వారు వాపోతున్నారు. ఎక్కడ నార్లు పోయలేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బోర్లు బావులలో నీళ్లు తాగడం లేదు. ఎక్కడో గోదావరి కృష్ణ నీళ్లు తరలించి తాగుతున్నారు. రెండోసారి విత్తనం రైతులు వేసి మొగుల్ల వైపు చూస్తున్నారు. గుమ్మిల్లో నిలువ ఎవరు ఉంచుకుంటలేరు. రెండేళ్లు కరువు వస్తే తిండి దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 90 వేల క్యూసెక్కుల సుమారు 8 టిఎంసి నీళ్లు కిందకు పోతున్నాయి. ఎండాకాలంలో కూడా రెండు టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాణహిత ఉంటుంది. పిల్లర్లు కూలిపోతున్న కూడా లక్ష్మీ బ్యారేజ్ లో నీళ్లు నింపుమని మేము కోరడం లేదు. దేవాదులకు బ్యారేజ్ లేదు. 0.7 టీఎంసీ రోజుకి బైరాజ్ లేకుండా దేవాది నుంచి లిఫ్ట్ అవుతుంది. కన్నేపల్లి పంపు హౌస్లు లో.. లెవల్లో ఉంటాయి. ఇప్పుడు మోటర్లు మునిగి నీళ్లు పంపు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కరువు సమయంలో కిందకు పోతున్న నీళ్లను లిఫ్ట్ చేయమని కోరారు.

రాజకీయాలు అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడితే ఖబర్దార్. అందరు రాజకీయ నాయకులు మాట్లాడేవి ప్రజలు వింటున్నారు.. బెస్ట్ జడ్జెస్ వారే. రెండు కోట్ల జనాభా ఉన్న హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్య వస్తే ఎలా అని అడగడం తప్ప. నీకు మేధోసంపత్తి ఉండవచ్చు.. రోజువారి పేపర్లలో ఏ వార్తలు రావాలనో చెప్పుకొని సోకు నీకు ఉండవచ్చు. కానీ ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్తున్నారు. మీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని చూడండి.టబిఆర్ఎస్ పార్టీని బోనులో నిలబెట్టాలని నువ్వు భావిస్తున్నావు.. కానీ నువ్వు బోనులో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను.తాగే నీటికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. దాడులు, విమర్శలు, నీచ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించాలని మీకు చెప్తున్నాన్నారు.

బిజెపి బిఆర్ఎస్ ఎలా ఒకటవుతుంది ? నీకు ముందు ముందు తెలుస్తుంది బీజేపీ ఏం చేయబోతుంది అని. నీ కిందికి నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు అహంకారంతో కళ్ళు కనిపించకుండా మాట్లాడుతారు. మీ చుట్టూ ఉన్నవారు ఆహా ఓహో అంటారు.. గతంలో కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే మాట్లాడారు.. ఖతం పట్టించారు. ఎంత ఉద్యమ నాయకులైనా ? ఎంత పని చేసినట్లు కనిపించినా ? సమయం వచ్చినప్పుడు పాతాళంలో పాత రేస్తారని మర్చిపోవద్దు. నా మీద మాట్లాడం కాదు ప్రజలతో మాట్లాడు కాంట్రాక్టర్ తో మాట్లాడు పని చేయించే ప్రయత్నం చెయ్యి. రైతు ఎంత లాభం వస్తుంది అని ఆలోచించడు .పంటను దక్కించుకోవడానికి ఎంత ఖర్చైనా పెడతాడు. వేసిన పంట చేతికి రాకపోతే ఏడుస్తాడు.

ఈ ప్రెస్మెట్ లో ఇరిగేషన్ రిటైర్ ఇంజనీర్లు సత్తిరెడ్డి, గోలి దామోదర రెడ్డి, జగదీష్, బీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బానుక నర్మదా మల్లికార్జున్, సురేందర్ రెడ్డి, గిరివర్ధన్, సురేష్ యాదవ్, విజయ్ ఆనంద్, VK మహేష్ , గిరివర్ధన్ రెడ్డి, BN శ్రీనివాస్, పిట్టల నగేష్, షాలిని విజయ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!