అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ :సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల

Must read

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని స్వయం సమృద్ధి కలిగిన ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నామని, ఇందుకుగాను అమరావతి పరిధిలోని భూములను మానిటైజ్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నగరంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. గతంలోనే క్వాంటం వ్యాలీకి పునాది వేశామని గుర్తుచేస్తూ, 2028 నాటికి అమరావతి మొదటి విడత (ఫేజ్-1) పనులను పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) వ్యయం నేటికి 98 శాతానికి చేరిందని, అమరావతి ఎకనామిక్ రీజియన్ ద్వారా సుమారు రూ. 8 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సీఎం వివరించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీర ప్రాంతాన్ని గోవాను మించిన ప్రముఖ అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలలు నెరవేరుతున్నాయని, అలాగే రాయలసీమ ప్రాంతాన్ని కూడా పూర్తిస్థాయిలో రాయల్ రాయలసీమగా మారుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇండియా ఎమర్జింగ్ నాలెడ్జ్, సిమెంట్, స్టీల్, స్పేస్ సిటీ, డ్రోన్ ర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గతంలో అశోకుడికి నాలుగో రాజధానిగా పనిచేసిన స్వర్ణగిరిలాగే, నేటి జొన్నగిరి ప్రాంతాన్ని స్వర్ణగిరిగా మారుస్తున్నామని చెప్పారు. త్వరలోనే గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌ను ప్రారంభించేందుకు రూ. లక్ష కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌తో పాటు ‘ఏపీ వన్’ అనే సమీకృత యాప్‌ను సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలోని నీటి నిల్వల శాతాన్ని డిజిటల్‌గా మానిటర్ చేస్తున్నామని వెల్లడించారు.

ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానం అనేది ఒక యథార్థమని, ప్రస్తుతం రాష్ట్రంలో 390 ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలోనే విజయవంతంగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు పీపీపీ విధానం వద్దంటూ విమర్శలు చేసే వైసీపీ నాయకులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం తమ ఖాతాలోనే వేసుకుంటారని ఎద్దేవా చేశారు. భోగాపురం విమానాశ్రయం పీపీపీ మోడల్‌లోనే నిర్మితం కాలేదా అని ప్రశ్నించారు. స్వయం బ్రాండ్ ద్వారా 60 అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, చిత్తూరు, చెన్నై నగరాల మధ్య అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు.

గతంలో తాము తీసుకువచ్చిన పీ3 (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) దేశానికి ఎంతో సంపదను సృష్టించిపెట్టిందని, ఇప్పుడు దానికి కొనసాగింపుగా పీ4 (ప్రజా రవాణా మరియు భాగస్వామ్యం) విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ పీ4 మోడల్ కింద రాష్ట్రంలోని 2 లక్షల 40 వేల నిరుపేద కుటుంబాలకు ఆర్థిక హ్యాండ్ హోల్డింగ్ సాయం అందిస్తున్నామని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక పెద్ద గేమ్‌ఛేంజర్ అవుతుందని ధ్వజమెత్తారు. దీని ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఏపీ సాకారమవుతుందన్నారు. సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందిస్తూ వారిని ఆర్థికంగా సాధికారులుగా మారుస్తున్నామని తెలిపారు. వారి పిల్లలను ఉన్నత చదువులతో పాటు సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బీసీ వర్గాలకు చెందిన 118 లక్షల మంది లబ్ధిదారులకు న్యాయం చేశామని, మద్యం దుకాణాలు, గనుల కేటాయింపుల్లో వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.

గత పాలకులు మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరాలు చేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ‘గొడ్డలి పార్టీ’కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. చివరికి సీసీటీవీ కెమెరాల కంటికి దొరికిపోతూ నేరాలు చేస్తూ ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నిఘా వ్యవస్థ అయిన ఆర్‌టీజీఎస్ ను పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. చివరికి 2026 నాటికి వాడాల్సిన డెఫిసిట్ ఫైనాన్స్ పరిమితిని 2024 నాటికే వైసీపీ ప్రభుత్వం వాడేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కుల అరాచకాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!