బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి.. బేరి రామచందర్ యాదవ్

Must read

బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి.. బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి వినతి పత్రం అందించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్

తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ గారికి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు.

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ నాయకులు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుండ్ల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ ఓబీసీ మోర్చా సమావేశం మదినగూడ భూమి బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు.

ముఖ్యంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నందున 54 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని పేద వర్గాలైన 132 బీసీ కులాలకు అన్ని విధాల సహాయ పడాలని విన్నవిస్తూ మెమొరాండం అందజేశారు. బీసీ కులాల్లో ఎక్కువగా పేదలు ఉన్నందున విద్యా, వైద్యంలాంటి అధిక ఖర్చులు భరించలేని పక్షంలో ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని విద్య కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరారు

పేదల కోసం ముద్ర లోన్లు, సబ్సిడీ లోన్స్ మిగతా అన్ని సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అన్ని బీసీ కుల సంఘాలకు వర్తించే విధంగా వృత్తి ధర్మంగా 132 కులాలకు సహాయం చేయాలని కోరారు. తుల్లో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకు లోన్ ఇవ్వనందున ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

రైతులకు సబ్సిడీ ఎరువులు సబ్సిడీ విత్తనాలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు సహాయపడాలని విన్నవించారు. ప్రజాస్వామ్యంలో చేతినిండా పని, కడుపునిండా అన్నం ఉండాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో రోజుగార్ యోజన గ్రామీణ సడక్ యోజన ఎన్ని యోజనాలు ఉన్నా కూడా పేదరికానికి తొలగించే విధంగా ప్రభుత్వాలు ఇంతవరకు ప్రయత్నం చేయలేదన్నారు

బీసీ కులాల బిసి సంఘాల ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ విజ్ఞప్తితో వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్ మేదరి సంఘం అధ్యక్షులు కొంటు ముకుందం బట్రాజు సంఘం అధ్యక్షులు రాజు విశ్వబ్రాహ్మణ సంఘం శేరిలింగంపల్లి శ్రీశైలం కురుమ, సాయిలు విశ్వకర్మ సంఘం హరికృష్ణ చారి ఐక్యవేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటగిరి మారుతి అధ్యక్షులు కృష్ణమోహన్ యువత అధ్యక్షులు కొంటూ సుమన్ ఆంజనేయులు గౌడ సంఘం రామకృష్ణ గౌడ్ మున్నూరు కాపు సంఘం బి కృష్ణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిలు, ముత్యం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!