రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజక్టులపై సమగ్ర సమీక్ష జరిగిందని, ఇందులో 25 పాత ప్రాజెక్టులతో పాటు 11 కొత్త ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నీటిపారుటల శాఖకు నిర్థేశించడం జరిగిందన్నారు. ప్రతి ప్రాజెక్టుకు శంకుస్థాపన, పురోగతి, పూర్తి గడువులు ఖచ్చితంగా నిర్దేశించబడటం జరిగిందన్నారు.
2026?2028 కాలానికి 36 ప్రాజెక్టుల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక?..గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 25 ప్రాజెక్టులతో పాటు, సీఎం గుర్తించిన మరో 11 ప్రాజెక్టులను కలిపి మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన ప్రాధాన్యతా క్రమం, దశలవారీ గడువులు, అమలు ప్రణాళిక రూపొందించబడిందన్నారు. 2026 జూలై నాటికి పోలవరం ఒఓఅ ద్వారా ఉత్తరాంధ్రకు నీటి సరఫరా, గుంటూరు ఛానల్ మోడరేషన్ పనుల శంకుస్థాపన, తుంగభద్ర కొత్త 33 గేట్ల ప్రారంభం వంటి కీలక పనులు అమలులోకి వస్తాయన్నారు. 2026 ఆగస్టు నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్?1 పూర్తి, అనంతపురం జిల్లాలో పేరూరు బ్రాంచ్ కెనాల్ శంకుస్థాపన, పాలేరు రిజర్వాయర్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
2026 అక్టోబర్ నాటికి హంద్రీ?నీవా (ఊఔSS) ఫేజ్?2 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. నవంబర్ 2026లో నేరేడి బ్యారేజ్ శంకుస్థాపన జరగనుందన్నారు. 2026 డిసెంబర్ నాటికి పెన్నా?సర్వేపల్లి రిజర్వాయర్ పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 2027 జనవరి నాటికి మడ్డువలస స్టేజ్?2 పూర్తి కావడంతో పాటు నీవా బ్రాంచ్ కెనాల్ మాలపల్లి వరకు ప్రారంభం కానుందన్నారు. 2027 ఏప్రిల్ నాటికి హీరమండలం ఎత్తిపోతల లిఫ్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు.
2027 జూన్ నాటికి నాగావళి?చంపావతి నదుల అనుసంధానం, బుడమేరు వరద రక్షణ పనులు, కొల్లేరు ప్రక్షాళన, ముక్త్యాల ఎత్తిపోతల పథకం మరియు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడిందన్నారు. 2027 జూలై నాటికి వంశధార స్టేజ్?2, చింతలపూడి ఎత్తిపోతల పథకం, మహేంద్రతనయ?గజపతినగరం బ్రాంచ్ కెనాల్స్, తోటపల్లి డిస్ర్టీ బ్యూటరీలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు. 2027 డిసెంబర్ నాటికి మాలపల్లి లిఫ్ట్ ద్వారా కళ్యాణి డ్యామ్ వరకు నీటి అనుసంధానం, మడకశిర బ్రాంచ్ కెనాల్, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
2028 డిసెంబర్ నాటికి తారకరామ సాగర్, వేదావతి ఎత్తిపోతల ప్రాజెక్టు, అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప (ఃTఖ), అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులు, ఉఔSS విస్తరణ (కడప?రాజంపేట?కోడూరు), సోమశిల?స్వర్ణముఖి లింక్ కెనాల్, గోదావరి డెల్టా ఆధునీకరణ (ఒఎఆంఖీ సర్వే ఆధారంగా), Sఖీఓఅ విస్తరణ (40,000 నుండి 80,000 క్యూసెక్లకు), ఉఔSS కోడూరు వరకు విస్తరణ, అలాగే వరికపూడిశల ప్రాజెక్టు పూర్తి చేయాలని సమగ్ర లక్ష్య ప్రణాళిక రూపొందించబడిందన్నారు. ఈ విధంగా 2026 నుండి 2028 వరకు రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని సమూలంగా మారుస్తూ, ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన లక్ష్యం, గడువు, అమలు దిశను ప్రభుత్వం ఖరారు చేసిందని మంత్రి తెలిపారు.





