విద్యతోనే బీసీలు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోగలరనేది సీఎం చంద్రబాబునాయుడు బావన. ఇటీవల ఆరు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇపుడు బీసీ విద్యార్థులకు మేలు కలిగేలా నూతన విద్య సంస్థలు నెలకొల్పాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా పది మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ కొత్త గురుకులాల్లో 37 మంది చొప్పున్న ఉద్యోగులను భర్తీ చేయనున్నారు.
ఈమేరకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ విద్య అభ్యసించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బడి బయట ఏ బీసీ బిడ్డా ఉండకూడదనేది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక వైపు బీసీ హాస్టళ్లు, మరో ఎంజేపీ గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది.
సకాలంలో డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తోంది. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సాంకేతిక విద్యకు కూడా ప్రాధాన్యమిస్తోంది. దీంతో బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఎంజేపీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం, కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టింది.
ఎంజేపీ గురుకులాల సీట్లకు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఆరు బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. కొత్తవలస(విజయనగరం), ఆత్మకూరు, గోలగముడి(నెల్లూరు), కలికిరి(అన్నమయ్య), ఓనిపెంట (కడప), నాసనకోట (శ్రీ సత్యసాయి జిల్లా) ఎంజేపీ గురుకుల పాఠశాలలను అప్ గ్రేడ్ చేశారు. ఆయా గురుకులాలల్లో తరగతలు సైతం ప్రారంభమయ్యాయి.
తాజాగా కొత్త గురుకుల పాఠశాలలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రమండలి ఆమోదం కూడా తెలిపింది. చ్చెర్ల(శ్రీకాకుళం), నక్కపల్లి(అనకాపల్లి), మాచెర్ల(పల్నాడు), గిద్దలూరు(మార్కాపురం), గుంతకళ్లు(అనంతపురం), రాయచోటి(అన్నమయ్య), పత్తికొండ, మంత్రాలయం(కర్నూలు), పెనుకొండ,కదిరి(శ్రీసత్యసాయి) లో ఎంజేపీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో గురుకులంలో 37 బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ గురుకుల పాఠశాలలో అయిదు బాలికలు, మరో అయిదు బాలుర పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతలను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన ఎంజేపీ గురుకులాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోని బీసీ బిడ్డలకు మరింత మేలు జరగనుంది. బీసీల విద్య కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.





