ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి శాశ్వత ముగింపు వచ్చేసింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో, అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా మారింది.
మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రకారం, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించమని నిర్ణయించబడింది. ఈ తీర్మానం ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్సభ ఏప్రిల్ 1న, రాజ్యసభ ఏప్రిల్ 2న ఈ బిల్లు ఆమోదం పొందిందని ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
చట్ట సవరణలో ముఖ్యంగా 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో మార్పులు చేశారు. “కొత్త రాజధాని ఉంటుంది” అనే పదాన్ని “అమరావతి కొత్త రాజధానిగా మార్చడం ద్వారా చట్టబద్ధత కల్పించారు. ఈ సవరణతో, భవిష్యత్తులో రాజధాని మార్పుపై చట్టంలో తప్పనిసరి మార్పులు చేయాలంటే, అది కేవలం పార్లమెంట్ పరిధిలో మాత్రమే సాధ్యమని స్పష్టతనిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా హర్షం వ్యక్తం భావోద్వేగకరమైన ట్వీట్ చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చారిత్రాత్మక రోజు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల నెరవేరింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలు.” లని ట్వీట్ ముగించారు.
రాజధాని స్థానంపై ఈ నిర్ణయం ప్రాంతీయ రాజకీయాలలో, ప్రభుత్వ విధానాల్లో ప్రధాన మైలురాయి గా నిలిచపోతుంది. అమరావతి సమగ్ర అభివృద్ధి, శాసన మౌలిక సదుపాయాల అమరిక, రాజకీయ స్థిరత్వం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.





