తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Must read

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు ఎండలు ఇటు వర్షాలతో తెలుగురాష్ర్టాల ప్రజలు విచిత్ర పరిస్థితి చూడబోతున్నారు.

ఇప్పటివరకు ఎండలు అయితే, రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంద్రఫ్రదేశ్​ పరిస్తితి బిన్నమైన వాతావరణాన్ని చూడబోతుందని వారు. సముద్ర పరివామక ప్రజలు అప్పమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

వర్షాల ప్రభావంతో, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారస్థులు,రోడ్లపై ప్రయాణించే ప్రజలకు జాగ్రత్త అవసరమన్నారు. అకస్మాత్ మోసమ్ మార్పుల వల్ల రోడ్లలో, కొరళ్లలో, నదీ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్పమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. భారీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఈ ప్రాంతాలకు రెడ్​ అలర్ట్ చేవారు.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక్కడ వాడగాలులు వస్తాయని తెలిపారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం. భారీ వర్షాలు కురుస్తాయని, సూర్యపేట, వరంగల్‌, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురసే అవకాశం ఉందని తెలియజేశారు.

వాతావరణ శాఖ ప్రత్యేకంగా జాగ్రత్త సూచిస్తూ, ప్రజలు అత్యవసరమైన సమయంలో మాత్రమే బయటకు రావాలని సూచించింది. అదేవిధంగా, విద్యార్థులు, మానసికంగా ప్రభావితమైన వ్యక్తులు వర్షాలు కురిసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!