జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యాభ్యాసంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని.. దేశ విదేశాల్లో
అపార ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.. గురువారం ఇక్కడ అక్కయ్యపాలెం జంక్షన్ లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో నలుగురు జర్నలిస్టుల పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి తన వంతు ప్రోత్సాహం గా 40 వేలు అందించారు.
నగరానికి చెందిన పాత్రికేయులు పిల్లా సతీష్ బాబు కుమారుడు పిల్లా సిద్ధార్థ బీటెక్ మూడో సంవత్సరం( మెకానికల్ ) విద్యాభ్యాసం సాగిస్తుండగా ప్రతి ఏటా ఫీజు నిమిత్తం గంట్ల శ్రీనుబాబు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు.. ఈ ఏడాది కూడా 10 వేలు ఫీజు నిమిత్తం అందజేశారు.. అలాగే గాజువాక ప్రాంతానికి చెందిన సీనియర్ పాత్రికేయులు.. పత్రికా సంపాదకులు జాన్ వరబాబు కుమారుడు జాన్ అలెక్స్ ప్రభుత్వ కృష్ణ కళాశాలలో ఎం ఎల్ టి రెండో సంవత్సరం విద్యాభ్యాసం సాగిస్తున్నారు.
అలెక్స్ కి కూడా గత ఏడాది ఫీజు 10 వేలు చెల్లించగా .. ఈ ఏడాది కూడా ఫీజు ఇతర ఖర్చులు నిమిత్తం 10 వేలు గంట్ల శ్రీనుబాబు అందజేశారు.. వీరితోపాటు ఇంటర్ విద్యాభ్యాసం సాగిస్తున్న మరో జర్నలిస్ట్ కుమారుడికి 10 వేలు ఫీజులు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కుమారుడు బీటెక్ విద్యాభ్యాసం కోసం 10 వేలు సహాయం అందించారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా సుమారు 150 మంది జర్నలిస్టుల పిల్లలకు తాను సొంతంగా ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందన్నారు.. ఈ ఏడాది కూడా సుమారు 152 మంది జర్నలిస్టులు పిల్లలకు ఉపకార వేతనాలు జూన్ 28న వి.ఎం.ఆర్.డి.ఏ చిల్డ్రన్స్ థియేటర్ లో అందజేశామన్నారు. అయితే ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్న కొంతమంది నిరుపేద విద్యార్థులకు ప్రతి ఏటా ప్రత్యేకంగా ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తున్నట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.. ఏడాది పొడవునా కొంతమందికైనా సహాయం అందించాలని భావించి ఇటువంటి విద్యా ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది అన్నారు.
అలాగే కొంతమంది జర్నలిస్టులకు అనారోగ్యం.. అత్యవసర పరిస్థితుల దృశ్య తన వంతు సహాయం అందజేయడం జరుగుతుందన్నారు.. హుద్ హుద్ తో పాటు కరోనా సమయంలోను పెద్ద ఎత్తున తన సొంత నిధులు ఖర్చు చేసి జర్నలిస్టులతో పాటు అనాధ.. వృద్ధాశ్రమాలకు. ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు సహాయం అందజేశానన్నారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తమ వంతు పరిధి మేరకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఇటువంటి అంశాలకు సంబంధించి యూనియన్లతో సంబంధం లేకుండా.. కుల మతాలకు తావు లేకుండా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తాను కోరుకుంటున్నట్లు గంట్ల శ్రీనుబాబు తన ఆకాంక్ష వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు 40 వేలు మొత్తం అందించారు..





