ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు: ముఖ్యమంత్రి చంద్రబాబు

Must read

ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది కలిగించేలా రాష్ట్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదాన్ని తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ పీఎస్ యులు, గురుకులాలు, సొసైటీలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు, గురుకుల పాఠశాలలో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 నుంచి 62 ఏళ్లకు పెంచటానికి క్యాబినెట్ సమావేశం అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వం రెండుసార్లు తిరస్కరించిన ఈ ఫైలును 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

2022 జనవరి 1 తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని వర్తింప చేసేలా కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఆయా సంస్థల్లో అవసరాల మేరకు తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వివిధ కార్పోరేషన్లు, గురుకులాలు, సొసైటీల్లో పనిచేసే 15 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

2004 సెప్టెంబరు కంటే ముందు జారీ అయిన వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ను వర్తింప చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదంతో 11 వేల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్ధిక, సామాజిక భద్రతకు ప్రభుత్వ నిర్ణయం భరోసా కల్పించనుంది.

ఉద్యోగులందరికీ కూటమి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం కేబినెట్ లో ఆమోదం తెలియచేసిన అంశాలతో పాటు గతంలోనూ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలుతీసుకున్నామని వెల్లడించారు.

సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ కల్పిస్తూ కూడా కూటమి ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగులకు మేలు కలిగించేలా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలియచేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!