ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని జగన్ తీవ్రంగా ఖండించారు.
రాధాకృష్ణ వ్యాఖ్యల్లో “రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైసీపీలో ఉన్నారు!” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మహిళలను వ్యక్తిగతంగా, సమాజంలోని పరిపాటి సందర్భంలో కించపరుస్తూ, అవమానపరచడం మాత్రమే కాక, రాజకీయ చర్చల్లో వారిని అనవసరంగా లాగడం అని జగన్ తీవ్రంగా అభిప్రాయపడ్డారు.
జగన్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు మహిళలపై దాడిగా భావించవలసినవి. ఆవేదన వ్యక్తం చేశారు. “ఎలాంటి వివక్షపూరిత జర్నలిజం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. మహిళలను అవమానించడమే కాక, ప్రజల్లో ‘మావిగన్ (MAVIGUN)’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఇది స్పష్టంగా సూచిస్తుంది” అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
జగన్ తన పోస్టులో మరో కీలక అంశాన్ని హైలైట్ చేశారు. మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు” అని పేర్కొన్నారు. “మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని జగన్ తెలిపారు.
రాజకీయ రంగంలో మహిళలను అవమానించడం సరికాదని జగన్ సూచించారు. వ్యక్తిగత జీవితాలను చర్చల ద్వారా నాశనం చేయడం సరికాదని. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.





