తెలుగు బాషా వైభవం

Must read

తెలుగు బాషా వైభవం
తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదనంలో ఉట్టి పడే సాహిత్యామృత రసగుల్లాలు,ప్రతి ఒక్కరి మనసుల్లో నిక్షిప్తమై సాగి పోయే నా తెలుగు మాతృభాష అవనిలో అగ్రగణ్యమై నిలిచింది…

తెలుగు భాష పుట్టిన క్షణం నుంచే, అమ్మ ఒడిలో వొదిగి పోయి
నేర్చిన, నా మాతృభాష
తరతరాలకు వెలుగు బాటలు వేస్తూ సాగి పోతున్న చూడ ముచ్చటైన భాషా నా
తెలుగు పలుకులు
తేనె ఊటలు ఊరించే
మాటల సుందర వాక్కులు..

తెలుగు పలుకులు వెదజల్లే అమృత బిందు వుల పరిమళాలు
ప్రకృతితో మమేకమై
నిత్య జీవితంలో ఎన్నో
అద్భుత విజయాలు సాధించిన అద్వితీయ
భాష తెలుగు సాహిత్యం నేటి వైభవం
గూర్చి ఎంత చెప్పిన
తక్కువే…

తెలుగు నేలలో పుట్టని వాడు, తెలుగు నేలలో
తెలుగు భాష మాట్లాడా
ని మనిషి జన్మ దుర్లభం.

తెలుగు పలుకుల వెలుగులతో మునిగి తేలుతూ,గతం ఘనమైన చరిత్రను సృష్టించినదని,ఎంతో కీర్తిని గడింపజేసిన బాషాకోవిదులు,మనకు ప్రవీణ్యులైన పండితులు వారే
అందించిన వాజ్మయం మనకు ఆదర్శం…

గుండు కోటేశ్వర్ రావు

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!