శ్రీకృష్ణుని వేలికి గాయం అయిన వేళ,
ద్రౌపది తన చీరకొంగు చించి కట్టిన వేళ…
అందులో కనిపించింది స్వార్థం లేని ప్రేమ,
ఆ చిన్న ముడిలో దాగింది జీవితాంతపు బంధం.
“నీకు ఆపదొస్తే నేనున్నాను” అన్న అన్నయ్య మాట,
“నీ కోసం ఏదైనా చేస్తాను” అన్న చెల్లి ప్రేమకు తోడు.
ద్రౌపది ఆపదలో “కృష్ణా!” అని పిలిచిన క్షణం,
అన్నగా ఆదుకున్నాడు ఆ మాధవుడు ఆ క్షణం.
నిండు సభలో ఆమె గౌరవం కాపాడిన చేయి,
అదే రక్షాబంధానికి నిలిచిన నిత్య సాక్ష్యం అయ్యి.
రాఖీ ముడిలో రక్తసంబంధం ఒక్కటే కాదు,
నమ్మకంతో కలిసిన మనసుల బంధమే అది.
అన్న అయినా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా,
ఆపదలో అండగా నిలిచేవాడే నిజమైన బంధువు.
రక్షణ ఇస్తాననే మాటకే రాఖీ ప్రతీక,
ప్రేమను జీవితాంతం నిలబెట్టే పవిత్ర బంధానికి ప్రతీక.
రాఖీ కట్టేది మణికట్టుకే అయినా,
ఆ బంధం మాత్రం హృదయంలో జీవితాంతం నిలిచిపోవాలి
హామీ పత్రం : పై కవిత నా స్వంత రచన





