రక్షాబంధనం – బంధానికి భరోసా

Must read

రాఖీ అంటే చేతికి కట్టే తాడు కాదు…
రెండు మనసులను కలిపే మధుర బంధం.
ఆ దారంలో దాగి ఉంటాయి ఎన్నో భావాలు,
ఎన్నో మాటలు… మరెన్నో మౌన ప్రమాణాలు.

అన్నకే కాదు… తమ్ముడికైనా కట్టొచ్చు,
అక్కకైనా, చెల్లికైనా ప్రేమగా కట్టొచ్చు.
జీవితాంతం తోడుంటారనే నమ్మకం ఉంటే,
ఆత్మీయమైన ఎవరికైనా రాఖీ కట్టొచ్చు.

“నీ కష్టంలో నేను నీకు తోడుంటాను,
నీ కన్నీటిలో నా భుజం నీకు ఆసరా,”
“ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీ వెంటే ఉంటాను,
నీ సంతోషమే నా సంతోషం” అనే భరోసా అది.

శ్రావణ పౌర్ణమి వేళ ముడిపడే ఈ బంధం,
కాలం మారినా చెదరని ఆత్మీయతకు ప్రతీక.
తల్లిదండ్రుల తర్వాత కూడా నీకు తోడుగా,
నీ అడుగులకు అండగా నిలుస్తాననే వాగ్దానం.

రాఖీ దారంలో ముడి ఒక్కటే అయినా,
ఆ ముడిలో జీవితకాల బంధం దాగి ఉంటుంది.
చేతికి కట్టేది రాఖీ అయినా…
మనసుకు కట్టేది నమ్మకం, ప్రేమ, భరోసా.

తనూజా వెంకట్​


రక్త సంబంధాల పర్వదినం…

మహిలో మహిళ సుందరిమణుల రక్షా బంధనం అంగరంగ వైభవంగా జరుపుకో వడానికి పుట్టింటికి
చేరి మనసులోనున్న సోదర ప్రేమతో అన్న తమ్ముళ్ళకు రాఖీని మణి కట్టుకు కట్టి పొంగి పోయే అక్క చెల్లెళ్ళ అద్భుత పర్వ దినోత్సవమే ఈ రక్షాబంధనం…

తనువులు దూరానున్న ఎప్పుడా, ఎప్పుడాని
ఎదురుచూస్తూ అన్న దమ్ముల అత్యున్నత
ఆత్మీయత అనురాగాల ను పంచుకోవడానికి
ఆ,అపూర్వ క్షణాల కోసం వ్యయప్రయాసలు
మరిచి పొందే ఆనంద మే దినమే రక్షా బంధనం…

తోడ బుట్టిన అన్న చెల్లెళ్ళ, అక్కతమ్ముళ్ళ అద్భుత రాఖీ పండుగ సంబరాలను ఇంటిల్లి పాదితో జరుపుకునే మధుర జ్ఞాపకాలను
మనసారా పంచుకొని
జీవితాంతం ఎవ్వరెక్క డునున్న మనను కలిపేది, ఒక్క రాఖీ పండుగనే ఈ సందర్భం
గా, అమ్మానాన్నలతో మమేకమై ఆశల నిలయంలో కలిసి సంబరపడి,అబ్బురపడే
క్షణాల మధ్య సాగి పోయే ఆప్యాయంగా
జరుపుకునే రాఖీ
పండుగ పర్వదినం.

గుండు కోటేశ్వర్ రావు

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!