ఏఐ ఆధారిత పాలన అందిస్తాం : టీవీకే చీఫ్‌ విజయ్‌

Must read

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్న విజయ్, తన పార్టీ తమిళగ వెట్రి కళగం తరఫున ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లాలో నిర్వహించిన భారీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ఆయన ఆరోపించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా భిన్నమైన పాలన అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పరిపాలనను అమలు చేస్తామని ప్రకటించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వ వ్యవస్థను పారదర్శకంగా మార్చి, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామని ఆయన హామి ఇచ్చారు.

ఏఐ ఆధారిత పాలన ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా అందించగలమని విజయ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తమిళనాడును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే కొత్త మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు.

ఇక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తమ పాలనా నమూనాను వివరించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించామని విజయ్ తెలిపారు. యువతను ఆకర్షించే విధంగా సాంకేతికతపై దృష్టి పెట్టడం, పారదర్శకతను పెంపొందించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ‘వెట్రి తమిళనాడు సూపర్ యాప్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తామన్నారు. పాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని, 10 లక్షల మంది మద్దతిచ్చిన ప్రజా వినతులను అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

ఇక డీఎంకే నాయకులు ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!