స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తాల్లోకి వచ్చింది సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. నటుడు విజయ్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారం పై త్రిషా పరోక్షంగా స్పందించింది. నేరుగా ఈ పుకార్లను తట్టకోలేకపోయినా ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని అర్థవంతమైన పోస్టులు ఇప్పుడు అభిమానుల, నెటిజన్ల చర్చకు కేంద్రబిందువయ్యింది.
తాజాగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొన్ని కోట్స్ షేర్ చేశారు. వాటిలో “మన శాంతికి భంగం కలిగించే దేన్నైనా వదిలేయాలి” “మీ విలువ మీకు తెలిసినప్పుడు, ఇతరుల మాటలు మిమ్మల్ని బాధించలేవు” అంటూ ఆమె పోస్టులల్లో తెలిపారు. ఈ పోస్టులు ప్రత్యేకంగా ఆమెపై వస్తున్న ఊహాగానాలకు ప్రతిస్పందనగా ఉన్నాయని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. మౌనమే ఒక శక్తివంతమైన సమాధానం అని ఆమె ఇక్కడ అభిప్రాయపడ్డారు.
త్రిష కృష్ణన్ శాంతికై ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా త్రిష వివిధ సందర్భాల్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చల్లో మౌనాన్ని ఒక వ్యూహంగా ఉపయోగించడం కనిపించింది.
త్రిష కృష్ణన్ తన ఫ్యాన్స్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చిందని భావిస్తున్నారు. వ్యక్తిగత జీవితం, ప్రేమ పరంపరల్లో ప్రతిఘటనలు, పుకార్లు, గాసిప్పులు ఎదురైనప్పుడు, వాటిని వదిలేయడం మంచిదని ఆమె సూచించారు.
ఈ రూమర్ల నడుమ త్రిష తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనవసరమైన ప్రచారాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.





