ప్రేమ జంటల రక్షణకు కర్ణాటకలో కొత్త చట్టం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణను కల్పించేందుకు ఒక విప్లవాత్మక చట్టం ప్రవేశపెట్టింది. పరువు హత్యలు, కులం–మతం పేరుతో జరుగుతున్న దాడులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
రాజ్యాంగ హక్కులను బలపరిచే దిశగా రూపొందించిన వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’ ను రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది. ఈ బిల్లు ప్రేమజంటల వ్యక్తిగత నిర్ణయాలను పరిరక్షించడంలో కీలకంగా మారనున్నది.
ఈ బిల్లు ప్రకారం, రెండు వేర్వేరు మతాల లేదా వేర్వేరు కులాల వ్యక్తులు ప్రేమించి, వివాహం చేసుకోవడం లేదా.. చేసుకోవాలనుకోవడం ద్వారా కలిగే ఇబ్బందులను పూర్తిగా నిర్మూలించడానికే, ప్రభుత్వం ద్వారా
పరిరక్షణ పొందగలుగుతారు. కులం, మతం పేరుతో జరిగే శారీరక దాడులు, మానసిక వేధనలు, పరువు హత్యలపై కఠిన శిక్షలు విధించబడతాయి.
మంత్రివర్గం ప్రకటనలో పేర్కొన్నట్లు, “ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించారు. ఈ బిల్లు ద్వారా కులం, మతం ఆధారిత అడ్డంకులను తొలగించడం లక్ష్యం,” అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉన్న ప్రేమజంటలకు భరోసా కల్పింస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రేమ జంటలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికే ఈ చట్టాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ చట్టం హింసాత్మక ఘటనలు మతపరమైన, కులపరమైన ఉద్రిక్తతలకు అడ్డుకుంటుదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవడానికి ముందుకు వచ్చిందని అభిప్రాయపడుతున్నామన్నారు.
ఈ బిల్లు అమలులోకి వచ్చిన వెంటనే పోలీస్ విభాగాలు ప్రేమికుల భద్రతను ప్రత్యేకంగా చూసుకోవాల్సి వస్తుందని, అలాగే, ఇలాంటి నేరాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కర్తవ్యం అవుతుంది.
నిపుణుల అభిప్రాయ ప్రకారం, ఈ చట్టం దేశంలో ప్రేమ జంటలపై ఆందోళన కలిగించే నిబంధనలకు ప్రత్యామ్నాయం. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రోత్సహించడంలో కర్ణాటక రాష్ట్రం ముందంజ వేస్తున్నదని అంటున్నారు.
మొత్తానికి, కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026 దేశంలో ప్రేమ జంటల రక్షణలో మైలురాయి స్థాయికి చేరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వ హక్కులను బలపరుస్తూ, సమాజంలో ప్రేమ జంటలకు భరోసా కలిగించే చట్టంగా గుర్తింపు పొందింది.





