లాకప్‌డెత్‌ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

Must read

కరోనా మహమ్మారి సమయంలో అమలు చేసిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో తమిళనాడులో తండ్రీ కొడుకులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఓ రోజు రాత్రాంత పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి కోడుకులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దారుణ సంఘటనపై ప్రజలు, సామాజిక సంస్థలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి.

పూర్తి వివరాలు కరోనా సమయంలో ప్రభుత్వం విధించిన నియమాలను అతిక్రమించి మొబైల్ ఫోన్ దుకాణం తెరిచారనే కారణంతో పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతని కొడుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకుని, ఇద్దరినీ ఒకే సెల్‌లో నిర్బంధించారు.

అనంతరం వారిపై పోలీసుల దౌర్జన్యం ప్రారంభమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రంతా తీవ్రంగా కొట్టడం, తండ్రీ కొడుకులు తీవ్ర గాయాలకు పాలయ్యారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసుల కస్టడీలో వ్యక్తుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. 2020లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. 020 జూన్ 19న అరెస్టు చేశారు. సాతంకుళం పోలీస్ స్టేషన్ వారిని చిత్రహింసలకు గురిచేశారని, ఈ క్రమంలో వారికి తీవ్ర గాయాలైయ్యాయని, బలమైన దెబ్బలు, అధిక రక్తస్రావం కూడా జరిగినట్టు దర్యాప్తులో తేలింది.

ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం, కేసు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానిజాలు వెలికితీయడానికి ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దాడి అనంతరం పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. బాధితులతోనే రక్తాన్ని వారే శుభ్రం చేయించారని, రక్తపు మరకలున్న బట్టలను పారవేశారని, నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు సమర్పించిన సీబీఐ నివేదికలో.. లాకప్ గోడలు, టాయిలెట్, ఎస్‌హెచ్‌ఓ గది, లాఠీల నుంచి సేకరించిన రక్త నమూనాలు బాధితుల డీఎన్ఏలతో సరిపోలాయని, ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. జూన్ 19న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కామరాజర్ చౌక్ వద్ద జయరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారని, తన తండ్రిని నిర్బంధించారని తెలుసుకున్న బెన్నిక్స్ స్టేషన్‌కు వచ్చాడని నివేదిక పేర్కొంది. తన తండ్రిని పోలీసులు కొట్టడంతో బెన్నిక్స్ పోలీసులను ప్రశ్నించడంతో దీంతో అతడ్ని అరెస్ట్ చేసి టార్చర్ చేశారు.

సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు ఆరేళ్ల తరువాత తీర్పు వెలువరిచింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని మృతుల కుటుంబాలకు రూ. 1.40 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ లాకప్​ డెత్​ కు కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. దీంతో చట్టానికి ఎవరు చుట్టాలు కాదని మరోసారి రుజువు చేసింది. దేశంలోనే మొదటి సారి పోలీసుల ఉరిశిక్ష అమలు చేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!