రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసిన మంత్రి సీతక్క

Must read

భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా రక్తదానం చేసి యువతకు, పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు.

రక్తదానం అనంతరం కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ మంత్రి సీతక్కకు రక్తదాన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, పేదలు, రైతులు, యువత, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయన రాజకీయాల్లో సేవాభావం, నిబద్ధత, నిజాయితీకి ప్రతిరూపమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నాయకుల జన్మదినాలను జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు.

రక్తదానం మహాదానం అని, ఒక యూనిట్ రక్తం అనేకమంది ప్రాణాలను కాపాడగలదని మంత్రి సీతక్క అన్నారు. యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి సీతక్క తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!