సూపర్ స్టార్ రజినీకాంత్ యువతను ఉద్దేశించి కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుత కాలంలో యువత దారి తప్పుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.
యువత సినిమాల్లో చూపించే సాహసాలను చూసి నిజ జీవితంలో అలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దని రజనీకాంత్ హితవు పలికారు. సినిమాలు వినోదం కోసం మాత్రమేనని, వాటిని అనుసరించడం వల్ల ప్రాణాలకు ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు.
సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువత వ్యసనాలకు బానిసలైతే కేవలం వ్యక్తిగత జీవితమే కాదు, వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం అవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశలు, భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.
“క్రమశిక్షణ లేని జీవితం నరకంతో సమానం” అని రజనీకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి యువకుడు తన జీవితంలో నియమనియంత్రణలు పాటించాలన్నారు. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
సినిమాల్లో హీరోలు చేసే స్టంట్లు చూసి వాటిని అనుకరించడం ప్రమాదకరమని హెచ్చరించారు. బైక్ రేసింగ్‌ల మంచి కావని అవి ప్రమాదాలకు దారీ తీస్తాయని ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోతారని.. దీంతో తమ కుటుంబం అనదా అవుతుందన్నారు.
ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని, యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విద్యార్థి దశలో చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని, అదే భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ అని రజనీ అన్నారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటి సాధన కోసం కృషి చేయాలని యువతకు రజనీకాంత్ సూచించారు.





