రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెడుతున్నారా…?

Must read

దేశ రాజకీయాల్లో రాఘవ్​ చద్దా సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ఆప్)లో ప్రముఖ యువ నేతగా గుర్తింపు పొందిన ఆయన, సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాఘవ్ చద్దా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు మాట్లాడుతూ, “రాఘవ్ చద్దా మరో పార్టీలో చేరడం కన్నా, యువత ఆధారంగా ‘జెన్ జెడ్ పార్టీ’ ఏర్పాటు చేస్తే మంచి మద్దతు లభిస్తుంది” అని సూచించాడు. ఈ వీడియోను చద్దా రీపోస్ట్ చేస్తూ “ఆసక్తికరమైన ఆలోచన” అంటూ స్పందించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

ఇటీవల జరిగిన పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ నేత పదవి నుంచి చద్దాను తొలగించిన తర్వాత పార్టీతో ఆయనకు దూరం పెరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై పార్టీ లోపలే చర్చలు జరుగుతున్నాయి.

రాఘవ్​ చద్దా ఉద్దేశించి పంజాబ్‌ సీఏం చేసిన వ్యాఖ్యాలు మరింత తీవ్రతరం చేస్తున్నాయి. చద్దా రాజీ పడ్డారని పంజాబ్​ మస్యలను ప్రస్తావించడం లేదని, పంజాబ్​ సీఎం చేసిన వ్యాఖ్యాలు వివాదాన్ని మరింత వేడెక్కించాయి.

(బీజేపీ) పట్ల ఆయన మెతక వైఖరి అవలంబిస్తున్నారని కొందరు ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, రాఘవ్ చద్దా సొంత పార్టీ ఏర్పాటు చేసే అవకాశముందా? లేక బీజేపీలో చేరతారా? అనే ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారాన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!