తెలంగాణలో పొత్తుతో వస్తున్నారా? సింగిల్‌గా వస్తున్నారా? :పవన్​ కళ్యాణ్​ కు ప్రకాష్​రాజ్​ సూటీ ప్రశ్న

Must read

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ప్రవేశంపై చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్న వేళ, ప్రముఖ నటుడు ప్రకాశ్​ రాజ్​ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేస్తామన్న ప్రకటనను ఉద్దేశించేలా ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జనసేన పార్టీ తెలంగాణలో కూడా రాజకీయంగా చురుకుగా వ్యవహరించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయాలతో ముందుకు సాగుతున్న జనసేన, తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయబోతోందన్న అంశంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. “వస్తానంటే వద్దంటామా.. రండి సార్. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా” అంటూ ఆయన ట్వీట్ చేశారు. తనకు ప్రత్యేక గుర్తింపుగా మారిన జస్ట్ ఆస్కింగ్​ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు లేకపోయినా, ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ప్రవేశంపై వచ్చిన ప్రకటన నేపథ్యంలో ఈ ట్వీట్‌ను చాలామంది నెటిజన్లు పవన్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యగానే భావిస్తున్నారు. ముఖ్యంగా “పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా?” అన్న ప్రశ్న రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించడం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జనసేన తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుందా? లేక ఇతర పార్టీలతో పొత్తులు కొనసాగిస్తుందా? అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ప్రకాశ్ రాజ్ గతంలో కూడా పలు రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా సామాజిక, రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఆయన వినియోగించే #JustAsking హ్యాష్‌ట్యాగ్ కూడా అనేక సందర్భాల్లో రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది.

ఈ ట్వీట్ వెలువడిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది. కొందరు నెటిజన్లు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు జనసేన రాజకీయ వ్యూహాన్ని ముందుగానే ప్రశ్నించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఈ ట్వీట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!