నేను లోకల్… పక్కా మాస్

Must read

  • వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్
  • 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఏనాడైనా డీఎస్సీ నిర్వహించారా..?
  • ఒక్క రోడ్డయినా వేశారా..?.. అభివృద్ధిపైన చర్చకు రెడీ

‘మా నాయకుడు రప్పా రప్పా అని నరకమని చెప్పలేదు.కబ్జాలు, దోపీడీలు చేయమని చెప్పలేదు మాకు సభ్యత, సంస్కారం నేర్పారు ఒకర్ని ఇబ్బంది పెట్టే నైజం మాది కాదు… మీకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి పెనుకొండ అంబేద్కర్ జంక్షన్ అయినా గోరంట్ల నిమ్మల కృష్ణప్ప థియేటర్ అయినా కల్యాణదుర్గమైనా ధర్మవరమైనా పులివెందులైనా ప్లేస్, టైమ్ మీరే డిసైడ్ చేయండి అంతేగాని నోరుంది కదా అని మాట్లాడితే ఊరుకునేది లేదు మేం పక్కా మాస్మా నోళ్లకు కంట్రోల్ ఉండదు ఖబడ్డార్’

‘నేను లోకల్… పుట్టింది ఇక్కడే … పెరిగింది ఇక్కడే… పోయేది ఇక్కడే… నేనేంటో పెనుకొండ వాసులందరికీ తెలుసు… శత్రువు ఇంటికి వచ్చినా కాఫీ ఇచ్చి గౌరవమిస్తా… సొంత కార్యకర్తలపై, బంధువులపై తప్పుడు కేసులు పెట్టే నైజం నాది కాదు…’ ‘5 ఏళ్లలో జగన్ రెడ్డి ఏనాడైనా డీఎస్సీ నిర్వహించారా…రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్డు వేశారా…జల్ జీవన్, జలధార అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారా..? చివరికి పులివెందులకు సాగునీరు ఇచ్చింది చంద్రబాబే… త్వరలో తాగునీరు కూడా ఇవ్వబోతున్నదీ చంద్రబాబే…అంటూ వైసీపీ నాయకులపై మంత్రి సవిత తీవ్రంగా విరుచుపడ్డారు.’

గోరంట్ల/శ్రీసత్యసాయి : తనను గెలిపించిన పెనుకొండ నియోజక వర్గ వాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చినతరవాతే గ్రామాల్లో అడుగుపెడుతున్నానని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అభివృద్ధి కేరాఫ్ అడ్రాస్ కూటమి ప్రభుత్వమని స్పష్టంచేశారు. అక్టోబర్ నుంచి నూతన పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. త్వరలో ఇళ్ల స్థలాలు కూడా అందజేయబోతున్నామని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి, గొడ్డలి పార్టీకి గుణపాఠం చెప్పాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌని వారి పల్లి పంచాయతీ మెయిన్ రోడ్డు నుంచి చెట్ల మురంపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రూ.2.50 కోట్ల చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, గత ఎన్నికల్లో గోరంట్ల మండల వాసులు తనను అఖండ మెజార్టీ ఇచ్చారన్నారు. గౌని వారి పల్లి పంచాయతీ మెయిన్ రోడ్డు నుంచి చెట్ల మురంపల్లి వరకు రోడ్డు నిర్మించిన తరవాతే గ్రామానికి వస్తానని ఆనాడే చెప్పానని, ఇపుడు మాట నిలబెట్టుకున్నానని అన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్దిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. అక్టోబర్ నెలలో నూతన పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. ఇళ్ల స్థలాలు కూడా కేటాయించనున్నామని మంత్రి సవిత తెలిపారు.

‘నాది పెనుకొండే… ఇక్కడే పుట్టా… ఇక్కడే పెరిగా…ఇక్కడే పోయేది… నా గురించి పెనుకొండ నియోజక వర్గ వాసులందరికీ తెలుసు. నా ఇంటికొస్తే శత్రువుకైనా కాఫీ సాగునంపుతా… ఇదీ నా నైజం… నా కార్యకర్తలపై, బంధువులపై తప్పుడు కేసులు పెట్టడం నాకు చేతకాదు’ అని మంత్రి సవిత అన్నారు. తమ నాయకుడు రప్పా రప్పా నరకమని, కబ్జాలు, దోపీడీలు చేయమని చెప్పలేదని న్నారు. తమకు సభ్యత, సంస్కారం నేర్పారని, వైసీపీ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిపైనా చర్చకు రావాలని, పెనుకొండ అంబేద్కర్ జంక్షన్ అయినా, గోరంట్ల నిమ్మల కృష్ణప్ప థియేటర్ అయినా, కల్యాణదుర్గమైనా, ధర్మవరమైనా, పులివెందులైనా, ఎక్కడైనా ప్లేస్, టైమ్ వారే డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు. నోరుంది కదా అని మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము పక్కా మాస్ అని, తమ నోళ్లకు కంట్రోల్ కూడా ఉండదు అని వైసీపీ నాయకులకు మంత్రి సవిత హెచ్చరించారు.

అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క రోడ్డూ కూడా నిర్మించలేదని మంత్రి సవిత మండిపడ్డారు. జలజీవన్ మిషన్ నిధులు కూడా వినియోగించలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఒక డీఎస్సీని కూడా జగన్ నిర్వహించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు. ఆ డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ జగన్ కడుపు మంట తీర్చుకుంటున్నారన్నారు. ఇకపై ఏటా డీఎస్సీలు నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్లు కూడా జారీ చేసి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని తెలిపారు. 2014-19లో పులివెందులకు సాగునీరు ఇచ్చిన సీఎం చంద్రబాబుదేనన్నారు. ఇపుడు పులివెందులకు తాడునీరు కూడా అందించబోతున్న ఘనత కూడా ఆయనేదనని మంత్రి సవిత తెలిపారు.

గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండళ్లలోనే చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. గోరంట్ల మండలానికి సంబంధించి పలు ఎన్నికల హామీలు నెరవేర్చామని, మిగిలిన హామీలను స్థానిక ఎన్నికలు ముగియగానే చేపడతామని మాటిచ్చారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రాస్ కూటమి అయితే, విధ్వంసానికి మారు పేరు వైసీపీ అని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని గోరంట్ల మండల వాసులకు మంత్రి సవిత పిలుపునిచ్చారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!