నాపై హత్యాయత్నం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి

Must read

కరీంనగర్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఈ దాడి అనంతరం స్పందించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ కుమ్మక్కయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి, “ఇది సాధారణ దాడి కాదు. నన్ను భయపెట్టడానికో, కారును ధ్వంసం చేయడానికో మాత్రమే రాలేదు. నన్ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్‌తో వచ్చారు” అని అన్నారు. తనపై జరిగిన దాడి వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని ఆయన ఆరోపించారు. “ఈ ఘటనతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటేనని స్పష్టమైంది. ఇద్దరూ కలిసి నాపై కుట్ర పన్నారు” అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తనపై దాడి జరిగే అవకాశముందని అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కౌశిక్ రెడ్డి వెల్లడించారు. “నా మీద ముందే రెక్కీ నిర్వహించారు. నన్ను టార్గెట్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో బయట పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు కార్యకర్తలు కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతలు ఈ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల వల్లే కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైందని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. డ్రగ్స్ ఆరోపణలు చేయడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!