రాజ్యసభకు నితీశ్ కుమార్..

Must read

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన ఈ రాజీనామకు సిద్ధమయ్యాడు. ఈ పరిణామంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఖాయమైందని స్పష్టమవుతోంది.

నేడు నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన తన రాజకీయ భవిష్యత్తును ఢిల్లీ కేంద్రంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు.

“బీహార్‌లో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాను. ఇకపై ఢిల్లీలో ఉండి జాతీయ రాజకీయాల్లో పనిచేయాలనుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. జేడీ(యూ) పార్టీ అంతర్గతంగా ఇప్పటికే నాయకత్వ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నితీశ్ కుమార్‌తో పాటు సంజయ్ ఝా, విజయ్ కుమార్ చౌదరి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ పరిణామాలు జేడీ(యూ) పార్టీ వ్యూహాత్మక మార్పులను సూచిస్తుంది.

నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఇప్పుడు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందని పలువురు రాజయకీయ నేతలు భావిస్తున్నారు. నితీశ్ కుమార్ జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాల్లో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇక బీహార్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు త్వరలోనే స్పష్టతకు రానున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై మాత్రమే కాకుండా జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!