గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. రియల్ టైం గవర్నెన్స్ విషయంలో.. ఏపీలో మేం వివిధ శాఖల నుంచి సేకరించిన డేటాతో ఒక డేటా లేక్ ను ఏర్పాటుచేశాం. దీని వల్ల నిర్ణయాలను మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ అనే భావనను ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయి. సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను ఎలా తొలగించాలనేదే మా ఆలోచన.
ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి సేవను ఒకే వాట్సాప్ నంబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం దాదాపు వెయ్యి ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా నాకు ఈ సమస్య ఉందని చెబితే.. మీరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని. వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపితే.. మీ సమస్య పరిష్కారమవుతుందని అని చెబుతాను. సర్టిఫికెట్లు కావాలన్నా, ఇతర సేవలు కావాలన్నా, అన్నీ డిజిటలైజ్ చేసి మొబైల్ ఫోన్ ద్వారానే అందిస్తున్నాం. ఇది రియల్ టైమ్ గవర్నెన్స్‌కు ఒక ఉదాహరణ మాత్రమే. అన్ని శాఖలను, అన్ని డేటా సెట్‌లను సమన్వయం చేసి సమర్థవంతమైన పాలన అందించడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్విజిబుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా నినాదం.
నీట్ వంటి పరీక్షల నిర్వహణ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనమందరం దీనిని అంగీకరిస్తాం. రాష్ట్రంగా మేం ఈఏపీసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చాం. అయితే నేను ఇంకో అడుగు ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ఒకే రోజు జరిగే పరీక్షపై ఆధారపడకూడదు. ఒక చెడు రోజు మొత్తం సంవత్సరాన్ని, కొన్నిసార్లు వారి భవిష్యత్తునే ప్రభావితం చేయవచ్చు.
అందుకే నేను నా శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో ఎప్పుడూ ఒకటే చెబుతుంటాను. ఈ సమస్యను మీ సొంత పిల్లల కోణంలో ఆలోచించాలి అని. ఏం తప్పు జరిగిందో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. సీబీఎస్ఈ పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని కూడా నేను పరిశీలించాను. మంత్రి దృష్టితో చూస్తే వ్యవస్థ చాలా బాగానే కనిపిస్తుంది. ప్రశ్నాపత్రాలు యాదృచ్ఛికంగా పంపిణీ అవుతాయి. పరీక్షలు జరుగుతాయి. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత అది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. అందుకే ఏం తప్పు జరిగిందో, ఎలాంటి సవరణలు అవసరమో తెలుసుకోవడం నాకు ముఖ్యమైంది. ఎందుకంటే సంపూర్ణమైన వ్యవస్థ అనేది ఏదీ ఉండదు. కాలానుగుణంగా సంస్కరణలు చేస్తూ.. మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి.
రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. 2019-2024 మధ్య వ్యవస్థల పతనాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను పుట్టినప్పటి నుంచే రాజకీయ వ్యవస్థను చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 14 రోజుల తర్వాత నేను జన్మించాను. కార్యకర్తలు ఎలా పనిచేస్తారో, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించేవారో చిన్నప్పటి నుంచే చూశాను. కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో నేను తొలిసారిగా సంస్థాగత వ్యవస్థల పతనాన్ని చూశాను.
నాపై 23 కేసులు పెట్టారు. అందులో హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నేను బాధ్యుల్ని చేయకపోతే, దీనికి అంతం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే కదా మనం ఎన్నికయ్యాం? 2019 నుంచి 2024 మధ్య జరిగిన విషయాలను యూట్యూబ్‌లో చూసినా తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి బయటకు కూడా రావడానికి అనుమతి ఇవ్వలేదు. పోలీసులు ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. కానీ ఈరోజు జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేం ఎక్కడా అడ్డుకోవడం లేదన్నారు.
న్యూఢిల్లీ: గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.