అమ్మ అమృతస్వరూపిణి

Must read

అమ్మ అనగానే
అక్షరాలకు ప్రాణం వస్తుంది,
మాటలకు మాధుర్యం చేరుతుంది,
మనసులకు మమకారం అంటుకుంటుంది॥

పసిబిడ్డ పలుకులలో
అమ్మనే ప్రథమ స్వరం,
పదం పలకకముందే
ప్రేమను పంచే దైవం॥

నిద్రలేని రాత్రుల్లో
నెత్తిన వేళ్ళతో వెన్నెల వెదజల్లే శివశేఖరం,
కన్నీటి చినుకుల్లో
కన్నుల్ని తుడిచే కరుణాసాగర తరంగం॥

తన కడుపు నొప్పులను దాచుకుని
ఇంటినిండా నవ్వులను వెలిగించే దీపం,
తన ఆశలను అర్పించి
కుటుంబ ఆశయాలను నెరవేర్చే అంకురం॥

ఆమె చేతుల్లోనే
జీవితపు మొదటి అక్షరాభ్యాసం,
ఆమె చూపుల్లోనే
ప్రపంచమంతా పరిమళించే సౌందర్యం॥

అమ్మ ఒక మాట కాదు
అద్భుతమైన ఒక మంత్రం…
ఆమె ఒక మనిషి కాదు
అమూల్యమైన ఒక సత్త్వం॥

మాతృదినోత్సవం ఒక రోజే కాదు
ప్రతి రోజు ఆమె పాదాల పూజే కావాలి,
ప్రతి శ్వాసలో ఆమె స్మరణే ఉండాలి,
ప్రతి విజయానికి ఆమె కేంద్రం కావాలి॥

అమ్మ ఉంటే
ఈ ప్రపంచం ఒక స్వర్గం,
తల్లి నవ్వుతుంటే
ఆ ఇల్లు ఓ ఆనందనిలయం॥

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!