కుంభమేళా మోనాలిసా జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన సహజ అందంతో సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా జీవితం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ప్రేమ వివాహం, ‘లవ్ జిహాద్’ ఆరోపణల తర్వాత ఇప్పుడు ఈ కేసు ఫోక్స చట్టం వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్వహించిన విచారణలో మోనాలిసా వివాహం జరిగిన సమయంలో మైనర్ అని,చట్టపరంగా పెళ్లికి అవసరమైన కనీస వయస్సు లేకపోవడంతో, ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై తీవ్రమైన నేరపూరిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో ఫర్మాన్ ఖాన్‌కు చట్టపరమైన ఇబ్బందులు పెరిగాయి. మైనర్‌ను వివాహం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆమెతో సహజీవనం చేసినందుకు కూడా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎన్సీఎస్టీ తెలిపింది.
మోనాలిసా వివాహ సమయంలో ‘లవ్ జిహాద్’ ఆరోపణలు పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహాన్ని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే, దీనికి ప్రతిగా మోనాలిసా ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ఇప్పుడు మైనర్ అంశం వెలుగులోకి రావడంతో కేసు పూర్తిగా కొత్త దిశలోకి వెళ్లింది. సోషల్ మీడియాలో ఒకప్పుడు ప్రేమజంటగా పేరు తెచ్చుకున్న మోనాలిసా జంట ఇప్పుడు చట్టపరమైన సమస్యలతో పోరాడుతున్నారు.
సోషల్ మీడియాలో ఒవర్ నైట్ లో స్టార్స్ గా ఎదిగిన వారి కథలు దాదాపు ఇలాగే వివిదాల్లో చిక్కుకుంటున్నాయి.
ప్రస్తుతం మోనాలిసా జీవితం కూడా అలాగే మారింది. ఇదే సమయంలో చట్టపరమైన అంశాలు మరింత
ఆవేదనకు గురిచేస్తాయి. ఈ కేసుతో మోనాలిసా జీవితం ఎలా మారుతుందోనని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన ఇంకా పెంచాలని,చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే వచ్చే సమస్యలు జీవితంపై ఎలాం టి ప్రభావాలు చూపుతాయో ఊహించలేమని, తొందరపాటుతో యువతి యువకులు పెళ్లిలు చేసుకోకూడదని పలువురు సూచిస్తున్నారు.





