హైదరాబాద్ నగరాభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరుగుతున్న భూముల వ్యవహారాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయానికి పెట్టారని, అయితే ఆ నిధులను నగరాభివృద్ధికి వినియోగించడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కవిత ఆరోపణలు చేశారు.హెచ్‌ఎండీఏకు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ముఖ్యమంత్రే ఉన్నారని గుర్తుచేస్తూ, ప్లానింగ్ విభాగంలో ఆయన అనుచరుల ఆధ్వర్యంలోనే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనలను పక్కనపెట్టారన్నారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన నామినేషన్ పనుల కంటే, ప్రస్తుతం సుమారు రూ.1,140 కోట్ల విలువైన కాంట్రాక్టులను అదే విధంగా అప్పగించారన్నారు. ఇది ఆర్థిక శాఖ నియమాలకు విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు.పారదర్శకమైన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దెబ్బతీస్తూన్నారని
అవినీతి కోసం కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని కవిత ఆరోపించారు. ముఖ్యంగా ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టులను ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి పేరుతో ప్రజల దృష్టిని మళ్లించాడానికి ప్రయత్నన్నారని ఆమె వాపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉంద్దేశించి జీహెచ్‌ఎంసీ పాలన ప్రస్తుతం ‘గుంపు మేస్త్రి’ చేతుల్లోకి వెళ్లిపోయిందని, అవినీతి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. నగరాభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత
ఎక్కువగా ఇస్తున్నారని ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంపై కూడా ఆమె ప్రశ్నించారు. గతంలో ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అదే కాంట్రాక్టును కొనసాగించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవిత చేసిన ఆరోపణలు రాజకీయాల్లో చర్చకు దారితీస్తాయా.. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురే అవకాశాలున్నాయ అన్న విషయం తెలియాల్సి ఉండగా ప్రస్తుతం కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం లా స్పందిస్తుందా లేదా.. వేచ చూడాలి.





