ఉత్సాహభరితంగా కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవ సమావేశం

Must read

రవీంద్ర భారతిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సినీటీవి గేయ రచయిత డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ అధ్యక్షతన జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనతి కాలంలోనే సాహిత్య సేవలో విశిష్టమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు నిర్వాహకులకు అభివందనలు తెలిపారు.

ముఖ్య అతిధి సంచాలకులు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని, అద్భుతమైన కవితలు వినిపించినందుకు సాహితీ ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు.

చక్కని మూడు పుస్తకాలు సమావేశంలో అవిష్కరించినందుకు సంతోషం వ్యక్తపరిచారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కవి విశ్రాంత బ్యాంకు అధికారి రాజేంద్రప్రసాద్ రచించిన అక్షర సౌరభాలు పుస్తకాన్ని,పొన్నాల ధనమ్మ వ్రాసిన గాయాలు నేర్పిన కావ్యాలు పుస్తకాన్ని విశ్రాంత అటవీ శాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెద్ది, బాల బంధు.

కవి గద్వాల సోమన్న వ్రాసిన 94వ పుస్తకం తంగేడు పూలు పుస్తకాన్ని సభాధ్యక్షులు డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ ఆవిష్కరించారు. ఈమధ్యనే ఐ. ఎ. ఎస్ గౌరవ హోదా పొందిన డాక్టర్ నరసింహారెడ్డిని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులుని, సాహితీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వదాన్యుడు అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

అతిధులు ఘంటా మనోహరరెడ్డి, గజవెల్లి సత్యనారాయణ స్వామి, వీర శైవ సమాజ అధ్హ్యక్షులు డాక్టర్ బదరీనాధ్, అంబటి లింగ క్రిష్ణారెడ్డి, డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు చక్కని ప్రసంగాలు చేసి సభికులను ఆకట్టుకున్నారు.

కవిసమ్మేళన సామ్రాట్ కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధాకుసుమ 60 మంది కవులతో చక్కగా కవిసమ్మేళనం నిర్వహించి అందరి మన్ననలను పొందారు. సభను మొదట డాక్టర్ దీపక్ న్యాతి, అతిధులను పరిచయం చేసి, అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. కవులకు, అతిధులకు మెమెంటోలతోను, శాలువాలు కప్పి పుస్తకాలు అందించి పూజ్యనీయులు దైవఙ్ఞ శర్మ సత్కరించారు. ధరణీ మహిళా సంస్థ అధ్యక్షురాలు ధనమ్మ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!