కలం స్నేహం వ్యవస్థాపకులు సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాత, గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో కలం స్నేహం జాతీయ కన్వీనర్ రాధిక కానుగు మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తరుణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కలం స్నేహం జాతీయ ఉపాధ్యక్షులు హరి రమణ నిర్వహణ చేయగా హైదరాబాద్ జిల్లా నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుండి కలం స్నేహం అనుబంధ సంస్థల సభ్యులు, పోస్టర్ డిజైనర్స్, మెయిన్ ప్యానెల్ మెంబర్స్, అడ్మిన్ ప్యానెల్ మెంబర్స్, జాతీయ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు , సభ్యులు పాల్గొనడం జరిగింది.
జాతీయ ఉపాధ్యక్షులు హరి రమణ మాట్లాడుతూ కథా స్నేహం సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూ అందరితో స్నేహపూర్వకంగా అభిమానంగా ప్రేమతో ఉండే మిత్రురాలు రాధిక ఈరోజు కలం స్నేహం జాతీయ కన్వీనర్ నుంచి మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ గా ఎదగడం ఎంతో హర్షనీయం అని కొనియాడారు. అలాగే కలం స్నేహ వ్యవస్థాపకులు గోపాల్ ఆచార్య మాట్లాడుతూ జీవితంలో అనుకున్నది సాధించాలంటే తపన మాత్రమే ఉంటే సరిపోదని దానికి తగిన క్రమశిక్షణ కార్యాచరణ తో లక్ష్యం సాధించే దిశలో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలమని దీనికి ఉదాహరణగా మిత్రురాలు రాధిక ఎంతో ఓర్పుతో విజయం కోసం ఎదురు చూసిందని సాధించాలనే మొండి వైఖరి పట్టుదలే రోజు విజయ శిఖరాలను చేర్చిందని కొనియాడారు.
కలం స్నేహంలో తనకిచ్చిన ఎటువంటి బాధ్యత అయిన పరిపూర్ణంగా చేసేదని లోతైన ఆలోచనలో, ముందుచూపుతో సానుకూల దృక్పథంతో , ప్రణాళికతో ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేయడంలో రాధిక సఫలీకృతమైందని తెలియజేశారు. కలలను ఆందరూ కంటారు కానీ వాటిని లక్ష్యంగా మలచుకొని నిరంతర అభ్యాసం చేస్తూ ప్రణాళికతో పట్టుదలతో క్రమశిక్షణగా ఓర్పుగా కృషి చేయడమే విజయం సూత్రం అని అన్నారు.
ఆషాడ మాస బోనాలు ఎంతో నిష్టతో జరుపుకొని కలం స్నేహం మాసం మాసం కవితోత్సవ క్రతువు విజయవంతంగా నిర్వహించుకుని మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ రాధిక కానుగును అభినందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కలం స్నేహం వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ ఆచార్యతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు హరి రమణ ,జాతీయ కన్వీనర్& మెదక్ జిల్లా చైర్ పర్సన్ కానుగు రాధిక, స్వర స్నేహం నల్గొండ జిల్లా అధ్యక్షులు జ్యోతి, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు వనజ, హైదరాబాద్ జిల్లా సభ్యులు స్వర్ణలత , నర్మద,గాయత్రి, లావణ్య,కీర్తన, మిరియాల లలిత , రాజేశ్వరి, పద్మ, వైష్ణవి, స్రవంతి, ఈదుల మమత , దంత వైద్యులు డాక్టర్ సరిత, ప్రేమలత, స్వరూప కందకట్ల పాల్గొని సభను విజయవంతం చేశారు.





