ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి :డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను కోరిన జాజుల శ్రీనివాస్ గౌడ్

Must read

గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, గతంలో ఉన్న మాదిరిగానే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీములు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉపముఖ్యమంత్రి బట్టి  విక్రమార్క ను కోరారు 

హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో జాజుల శ్రీనివాస్ గౌడ్ బేటి అయ్యారు ఈ సందర్భంగా బీసీ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకు జాజుల అందజేశారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు వేధిస్తున్నాడంతో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు, కాంట్రాక్టర్లకు బిల్లులను ఆపి పేద విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జాజుల అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. విద్య అనేది సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రధాన సాధనమని, అందువల్ల పేద విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

బీసీ సంక్షేమ సంఘం తరఫున సమర్పించిన వినతిపత్రంలో ఫీజు బకాయిల తక్షణ చెల్లింపుతో పాటు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల విద్యా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా కోరినట్లు సమాచారం.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశాలను సానుకూలంగా స్వీకరించినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సానుభూతితో ఉందని, సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అలాగే 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఏ విధంగా అమలు చేశారో ఇప్పుడు కూడా జీవో నెంబర్ 8, 9 లను రద్దుచేసి పాత పద్ధతిలోని ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని ఆయన కోరారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేల ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!